Affordable Cars: భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!

|

Dec 24, 2024 | 6:57 PM

Top Affordable Cars in Indian Market: ప్రతి ఒక్కరూ తక్కువ ధరల్లో కారు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. 5 లక్షల లోపు ధర ఉండే అలాంటి కార్ల గురించి తెలుసుకుందాం. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. తక్కువ ధరల్లో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ అనే చెప్పాలి. దేశంలో అత్యంత చవకైన కార్లు ఏవో చూద్దాం.

1 / 5
ఈ రోజుల్లో కారు కొనాలనే కల చాలా మందిలో ఉంటుంది. కానీ కొందరికి నెరవేరవచ్చు.. కొందరికి నెరవేరకపోవచ్చు. ఈ రోజుల్లో సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే కార్లు ఉన్నాయి. భారతదేశంలో చౌకైన కార్ల గురించి తెలుసుకుందాం..

2 / 5
మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10): మారుతి సుజుకి ఆల్టో కె10. ఇది బెస్ట్ సెల్లర్. కంపెనీ ఆల్టో కె10లో 1-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 67PS పవర్, 89Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఐచ్ఛిక ఐదు-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో ఉంటుంది. దీనితో పాటు, ఆల్టో కె10 సిఎన్‌జి వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఐడిల్-ఇంజిన్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు.

3 / 5
మారుతీ సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio): మరో కారు మారుతి సుజుకి సెలెరియో. ఇది చౌక కార్లలో ఇదొకటి. సెలెరియోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 67bhp శక్తిని, 89nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. సెలెరియో ప్రారంభ ధర రూ.5 లక్షల 36 వేలు. ఇది ఇండియన్ మార్కెట్లో మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

4 / 5
టాటా టియాగో (Tata Tiago): మూడో కారు టాటా టియాగో. ఈ కారు మీ బడ్జెట్ విభాగంలో ఖచ్చితంగా సరిపోతుంది. ఈ టాటా కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 86bhp శక్తిని, 113nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. టియాగోలో మీరు CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ కూడా ఉంటుంది. భారతీయ మార్కెట్లో మీరు టాటా టియాగోను రూ. 4 లక్షల 99 వేల ప్రారంభ ధరతో లభిస్తుంది.

5 / 5
మారుతీ సుజుకి S-ప్రెస్సో (Maruti Suzuki S-Presso): మీ బడ్జెట్‌కు సరిపోయే నాల్గవ కారు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఆల్టో కె10 ఇంజన్ ఎస్-ప్రెస్సోలో అందుబాటులో ఉంది. ఈ కారు బేస్ వేరియంట్ రూ. 5 లక్షల లోపు వస్తుంది. S ప్రెస్సోలో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 68PS పవర్, 90Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.