Electric Scooters: ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. ధర కూడా చాలా తక్కువ..

Updated on: Jan 15, 2024 | 6:35 PM

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ఎంత పెరుగుతున్నా.. దానిలో ప్రధానంగా వినియోగదారులకు ఇబ్బంది కలిగిస్తున్న అంశాల్లో వాటి అధిక ధరలతో పాటు వాటి చార్జింగ్ సమయం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. లక్ష పైనే ఉంటున్నాయి. అదే సమయంలో ఆ స్కూటర్లలోని బ్యాటరీల చార్జింగ్ సమయం ఎనిమిది పది గంటలు ఉంటోంది. దీంతో వినియోగదారులు ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో అతి తక్కువ చార్జింగ్ సమయం తీసుకునే స్కూటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఇవి రూ. లక్షలోపు ధరలోనే అందుబాటులో ఉంటాయి. పైగా ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.

1 / 5
ఒకినావా ప్రైజ్ ప్రో..
ఈ ఒకినావా ప్రైజ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఇది కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జ్ కంప్లీట్ అవుతుంది. దీనిలో బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 81కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 99,645(ఎక్స్ షోరూం)గా ఉంటుంది.

ఒకినావా ప్రైజ్ ప్రో.. ఈ ఒకినావా ప్రైజ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఇది కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జ్ కంప్లీట్ అవుతుంది. దీనిలో బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 81కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 99,645(ఎక్స్ షోరూం)గా ఉంటుంది.

2 / 5
ఓలా ఎస్1ఎక్స్..
దేశంలోని టాప్ బ్రాండ్లలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న స్కూటర్ ఇది. దీని ధర రూ.99,999 వరకూ ఉంటుంది. దీనిలో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంటుంది. కేవలం 7.5 గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జింగ్ ఎక్కుతుంది. ఇది కూడా ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకునే హోమ్ చార్జర్. ఈ హైపర్ చార్జర్ తో కేవలం 15 నిమిషాలు చార్జింగ్ పెడితే కనీసం 50 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. దీనిలోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అయితే 151కిలోమీటర్ల రేంజ్ వస్తుంది.

ఓలా ఎస్1ఎక్స్.. దేశంలోని టాప్ బ్రాండ్లలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న స్కూటర్ ఇది. దీని ధర రూ.99,999 వరకూ ఉంటుంది. దీనిలో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంటుంది. కేవలం 7.5 గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జింగ్ ఎక్కుతుంది. ఇది కూడా ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకునే హోమ్ చార్జర్. ఈ హైపర్ చార్జర్ తో కేవలం 15 నిమిషాలు చార్జింగ్ పెడితే కనీసం 50 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. దీనిలోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అయితే 151కిలోమీటర్ల రేంజ్ వస్తుంది.

3 / 5
కైనెటిక్ గ్రీన్ జింగ్..

ఈ కైనెటిక్ గ్రీన్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఇది కేవలం మూడు గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జింగ్ పూర్తవుతుంది. ఇది సింగిల్ చార్జ్ పై 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. హై స్పీడ్ వెర్షన్ స్కూటర్ ధర రూ. 84,990(ఎక్స్ షోరూం)గా ఉంటుంది.

కైనెటిక్ గ్రీన్ జింగ్.. ఈ కైనెటిక్ గ్రీన్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఇది కేవలం మూడు గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జింగ్ పూర్తవుతుంది. ఇది సింగిల్ చార్జ్ పై 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. హై స్పీడ్ వెర్షన్ స్కూటర్ ధర రూ. 84,990(ఎక్స్ షోరూం)గా ఉంటుంది.

4 / 5
లెక్స్‌ట్రిక్స్ ఈవీ ఎల్ఎక్స్ఎస్ జీ2.0..
ఈ లెక్స్‌ట్రిక్స్ ఈవీ ఎల్ఎక్స్ఎస్ జీ2.0 కూడా కేవలం కేవలం మూడు గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జింగ్ చేస్తుంది. దీనిలోని బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు వస్తుంది. దీని ధర రూ. 99,990(ఎక్స్ షోరూం)గా ఉంది.

లెక్స్‌ట్రిక్స్ ఈవీ ఎల్ఎక్స్ఎస్ జీ2.0.. ఈ లెక్స్‌ట్రిక్స్ ఈవీ ఎల్ఎక్స్ఎస్ జీ2.0 కూడా కేవలం కేవలం మూడు గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జింగ్ చేస్తుంది. దీనిలోని బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు వస్తుంది. దీని ధర రూ. 99,990(ఎక్స్ షోరూం)గా ఉంది.

5 / 5
జాయ్ ఈ-బైక్..
మంచి స్టైలిష్ లుక్ లో ఉండే ఈ జాయ్ ఈ-బైక్ వోల్ఫ్ స్కూటర్ కూడా ఫాస్ట్ చార్జర్ సపోర్టుతో వస్తుంది. ఇది కేవలం రెండున్నర గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జ్ అవుతుంది. ఇదే స్కూటర్ తో సాధారణ చార్జర్ కూడా వస్తుంది. దాని సాయంతో సున్నా నుంచి వంద శాతం చార్జ్ అవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. దీని ధర రూ. 91,350(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 90కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

జాయ్ ఈ-బైక్.. మంచి స్టైలిష్ లుక్ లో ఉండే ఈ జాయ్ ఈ-బైక్ వోల్ఫ్ స్కూటర్ కూడా ఫాస్ట్ చార్జర్ సపోర్టుతో వస్తుంది. ఇది కేవలం రెండున్నర గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జ్ అవుతుంది. ఇదే స్కూటర్ తో సాధారణ చార్జర్ కూడా వస్తుంది. దాని సాయంతో సున్నా నుంచి వంద శాతం చార్జ్ అవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. దీని ధర రూ. 91,350(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 90కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.