EMI చక్రవ్యూహంలో పడేముందు ఈ విషయాలు తెలుసుకోండి! నాన్న చెప్పిన 4 ఆర్థిక నియమాలు

Updated on: Sep 26, 2026 | 7:55 PM

 కాలేజీ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన కొత్తలో మొదటిసారి శాలరీ చేతికి రాగానే ప్రతి యువకుడికీ ఎన్నో కోరికలు ఉంటాయి. ముఖ్యంగా మార్కెట్లో కొత్తగా వచ్చిన ఖరీదైన స్పోర్ట్స్ బైక్ లేదా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ చూడగానే వెంటనే సొంతం చేసుకోవాలనిపిస్తుంది. చేతిలో పూర్తి నగదు లేకపోయినా షోరూమ్‌ల వద్ద సేల్స్‌మెన్ చిరునవ్వుతో చెప్పే "సార్.. నెలకు కేవలం ₹5,999 కడితే చాలు, ఈరోజే బండి మీ ఇంటికి వెళ్తుంది" అనే మాట వినగానే ఎవరైనా ఆకర్షితులవుతారు. 

1 / 5
షోరూమ్‌లో సంతకం పెట్టే క్షణంలో ఒక తండ్రి తన కొడుకుతో చెప్పిన జీవిత సత్యం ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగిస్తుంది. "ఈ ఒక్క సంతకం పెడితే వచ్చే మూడేళ్ల నీ జీవితం నీది కాదురా.. నువ్వు నిజంగా బైక్ కొంటున్నావా లేక నీ భవిష్యత్తును బ్యాంకుకు తాకట్టు పెడుతున్నావా?" అంటూ ఆ తండ్రి విప్పిన ఈఎంఐ రహస్యాలను 'మన ధన సూత్రం' ఛానల్ అద్భుతంగా వివరించింది.

2 / 5
ఈఎంఐ & నో-కాస్ట్ ఈఎంఐ వెనుక దాగిన నిజాలు: ₹2 లక్షల బైక్‌ను మూడేళ్ల ఈఎంఐపై తీసుకుంటే వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీలు అన్నీ కలిసి చివరికి కట్టే మొత్తం దాదాపు ₹2,60,000 దాటిపోతుంది. అంటే కష్టపడి సంపాదించిన దానిలో ₹60,000 కేవలం వడ్డీ రూపంలోనే బ్యాంకుకు వెళ్లిపోతుంది; పెట్రోల్, సర్వీసింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు అదనం[. ఇక ఆన్‌లైన్‌లో ఊదరగొట్టే No Cost EMI అనేది కంపెనీలు కనిపెట్టిన ఒక మార్కెటింగ్ మాయ మాత్రమే. వస్తువు అసలు ధరలోనే వడ్డీని ముందే కలిపేయడం లేదా క్యాష్ డిస్కౌంట్‌ను తగ్గించడం, ఫైల్ చార్జీల రూపంలో అదనంగా వసూలు చేయడం ద్వారా వినియోగదారుల చేత బలవంతంగా ఖర్చు చేయిస్తాయి.

3 / 5
ఈఎంఐ చక్రవ్యూహం & మంచి అప్పు vs చెడ్డ అప్పు: ఒక బైక్ లేదా ఫోన్ ఈఎంఐతో మొదలైన ఖర్చు.. నెలాఖరుకు డబ్బుల్లేక క్రెడిట్ కార్డు వాడటానికి, ఆ బిల్లు కట్టలేక దాన్ని మరో ఈఎంఐగా మార్చడానికి దారితీస్తుంది. ఈ చక్రవ్యూహం నుంచి బయటపడాలంటే 'మంచి అప్పు' (Good Debt), 'చెడ్డ అప్పు' (Bad Debt)ల మధ్య తేడా తెలుసుకోవాలి. హోమ్ లోన్ లేదా వ్యాపార పరికరాల వంటి విలువ పెరిగే ఆస్తుల కోసం తీసుకునేది మంచి అప్పు; కాలక్రమేణా విలువ పడిపోయే బైకులు, గ్యాడ్జెట్లు, విలాసాల కోసం తీసుకునేది మనల్ని పేదరికంలోకి నెట్టే చెడ్డ అప్పు.

4 / 5
వాహనం కొనేముందు పాటించాల్సిన 4 గోల్డెన్ రూల్స్: అవసరమా లేక అహంకారమా?: ఆ వస్తువు లేకపోతే కెరీర్ గ్రోత్ ఆగిపోతుందా లేక నలుగురి ముందు పోజు కొట్టడానికే కొంటున్నానా అని ఆలోచించాలి. 20/4/10 సూత్రం: వాహనం కొనేటప్పుడు కనీసం 20% డౌన్‌పేమెంట్ కట్టాలి, లోన్ గడువు 4 ఏళ్లకు మించకూడదు, నెలవారీ ఈఎంఐ మీ జీతంలో 10% కంటే ఎక్కువ ఉండకూడదు.

5 / 5
ఎమర్జెన్సీ ఫండ్: ఉద్యోగం పోయినా లేదా ఆపద వచ్చినా కనీసం 6 నెలల పాటు ఖర్చులు, ఈఎంఐలు నెట్టుకొచ్చే నగదు సిద్ధంగా ఉందా లేదా సరిచూసుకోవాలి. పొదుపు ఆగకూడదు: ఈఎంఐ కట్టడం కోసం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ (SIP) లేదా పొదుపు ఆగిపోతుంటే, ఆ వస్తువును కొనే స్తోమత మీకు ఇంకా రాలేదని అర్థం. చేతిలో వాడే బైక్ లేదా ఫోన్ మన సంపదను నిర్ణయించదు; రేపు పని చేయకపోయినా ఎన్ని నెలలు ప్రశాంతంగా జీవించగలమనేదే మన నిజమైన సంపద

Loading...
Unable to load recommendations.
Follow Us