
1. భయం - ప్రేమ కాదు (Be Feared, Not Loved): మ్యాకియవెల్లి సిద్ధాంతాల ప్రకారం, ఒక నాయకుడు ప్రేమించబడటం కంటే భయపడటం ఎక్కువ అవసరం. ప్రేమ పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది, కానీ శిక్ష పడుతుందనే భయం ప్రజలను అదుపులో ఉంచుతుంది. ఇది నాయకుడి అధికారాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఉదాహరణకు, ఒక మంచి రాజు తన దయ వల్ల సైనికుల నుండి ప్రేమ పొందినా, యుద్ధంలో భయం లేనందున వారు పోరాడటానికి వెనుకాడారు. అదే సమయంలో, క్రూరమైన రాజు యొక్క భయం సైనికులను ప్రాణాలకు తెగించి పోరాడేలా చేసింది.

2. నక్క మరియు సింహం వ్యూహం (The Fox and the Lion): ఏ ప్రిన్స్ మస్ట్ బి ఏ ఫాక్స్ టు రికగ్నైజ్ ట్రాప్స్ అండ్ ఏ లయన్ టు ఫ్రైటెన్ వూల్వ్స్." అంటే, శత్రువుల వలలను గుర్తించడానికి నక్క తెలివి, వారిని భయపెట్టడానికి సింహం బలం ఉండాలి. కేవలం బలం లేదా తెలివి మాత్రమే సరిపోదు. మ్యాకియవెల్లికి ఇష్టమైన నాయకుడు సీజరే బోర్జియా, తనపై తిరుగుబాటు చేయాలని చూసిన సేనాధిపతులను క్షమించినట్లు నటించి, వారిని ఆహ్వానించి, నిరాయుధులుగా వచ్చినప్పుడు వారిని బంధించి చంపేశాడు. ఇది నక్క తెలివి, సింహ బలం రెండూ కలిపి వాడిన పద్ధతికి నిదర్శనం.

3. మోసం యొక్క శక్తి (The Power of Deception): "నెవర్ అటెంప్ట్ టు విన్ బై ఫోర్స్ వాట్ కెన్ బి వన్ బై డిసెప్షన్." అంటే బలంతో సాధించలేని విజయాన్ని మోసంతో సాధించాలి. బలమైన శత్రువును ఎదుర్కొనేటప్పుడు మొండిగా తలపడటం ఆత్మహత్యతో సమానం. ఛత్రపతి శివాజీ మహారాజ్, అఫ్జల్ ఖాన్‌ను నేరుగా ఎదుర్కోలేక, సంధి పేరుతో తనను తాను భయపడినట్లు చూపించి, దగ్గరకు వచ్చిన అఫ్జల్ ఖాన్‌ను పులిగోరుతో అంతం చేశారు. ఇది బలంతో కాకుండా వ్యూహంతో సాధించిన విజయం.

4. అవసరమే ప్రామిసుల కంటే ముఖ్యం (Necessity Over Promises): "ద ప్రామిస్ గివెన్ వాస్ ఏ నెసెసిటీ ఆఫ్ ద పాస్ట్. ద వర్డ్ బ్రోకెన్ ఈజ్ ఏ నెసెసిటీ ఆఫ్ ద ప్రెజెంట్." అంటే పరిస్థితులు మారినప్పుడు పాత వాగ్దానాలు, బంధాలు మీ ఎదుగుదలకు అడ్డువస్తే, వాటిని వదులుకోవడంలో తప్పులేదు. సీజరే బోర్జియా రోమాగ్నా ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి క్రూరమైన రెమీరోను నియమించాడు. ప్రజల ద్వేషం తనపైకి రాకుండా ఉండటానికి, రెమీరోను బలిపశువును చేసి చంపేశాడు, తద్వారా తన అధికారాన్ని, ప్రజల మద్దతును నిలబెట్టుకున్నాడు.

5. సద్గుణం యొక్క ముసుగు (The Mask of Virtue): "ఎవ్రీవన్ సీస్ వాట్ యూ అప్పియర్ టు బి. ఫ్యూ ఎక్స్పీరియన్స్ వాట్ యూ రియల్లీ ఆర్." లోకానికి మీరు దయామయుడిగా, నిజాయితీపరుడిగా కనిపించవచ్చు, కానీ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైనప్పుడు క్రూరంగా మారడానికి సిద్ధంగా ఉండాలి. ఒక మంత్రి మంచివాడిగా నటించి, రాజుకు అత్యంత నమ్మకమైన సైనికులను శత్రువులుగా చూపించి, వారిని చంపించి, చివరకు సింహాసనాన్ని చేజిక్కించుకున్న కథ ఈ సిద్ధాంతానికి ఉదాహరణ.

6. ఫలితాలే ముఖ్యం (Results Matter): మీరు చేసిన పని నైతికంగా తప్పు కావచ్చు, కానీ దాని వల్ల వచ్చిన ఫలితం గొప్పదైతే, ఆ విజయం మీ తప్పులన్నింటినీ కప్పేస్తుంది. చరిత్ర గెలిచిన వారినే గుర్తుంచుకుంటుంది. రోమ్ స్థాపకుడు రోమ్యులస్ తన రాజ్యాన్ని నిలబెట్టడానికి సొంత తమ్ముడు రెమస్ను చంపినా, చివరికి రోమ్ గొప్ప సామ్రాజ్యంగా మారడం వల్ల, చరిత్ర అతన్ని గొప్ప సామ్రాజ్య నిర్మాతగా గౌరవిస్తుంది.

7. ఒకేసారి, గట్టిగా దెబ్బ కొట్టండి (Strike Hard and Once): "ఇంజ్యూరీస్ షుడ్ బీ డన్ ఆల్ ఎట్ వన్స్ సో దట్ బీయింగ్ టేస్టెడ్ లెస్, దే అఫెండ్ లెస్." అంటే, కఠినమైన నిర్ణయాలు లేదా శిక్షలు ఒక్కసారిగా, వేగంగా అమలు చేయాలి. నెమ్మదిగా నష్టాన్ని కలిగించడం ద్వేషాన్ని పెంచుతుంది. అగాతోక్లెస్ అనే సామాన్య సైనికుడు రాజుగా మారడానికి, రాజ్యంలో ఉన్న ధనవంతులను ఒకేసారి చంపేసి, ఆ తర్వాత ప్రజలకు చిన్న చిన్న మంచి పనులు చేస్తూ వెళ్ళాడు. ప్రజలు కాలక్రమేణా రక్తపాతాన్ని మర్చిపోయి, అతని ఉపకారాలను గుర్తుంచుకున్నారు.

8. పరిస్థితులకు అనుగుణంగా మారడం (Adaptability): పరిస్థితులు మారినప్పుడు పాత పద్ధతులకు లేదా నీతికి కట్టుబడి ఉండటం నాశనానికి దారి తీస్తుంది. గెలుపు కోసం అవసరమైతే మీ ప్రణాళికలు, విధానాలను మార్చుకోవాలి. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న రాజులు, ఒక పెద్ద సామ్రాజ్యం దాడి చేసినప్పుడు, రెండో రాజు తన స్నేహితుడికి ఇచ్చిన మాటను పక్కన పెట్టి, శత్రువుతో చేతులు కలిపి తన ప్రజలను కాపాడుకున్నాడు. తన ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు, పాత వాగ్దానాల కంటే తన రాజ్యమే ముఖ్యమని నిరూపించుకున్నాడు.