UPI Payments: యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నారా..? మీరు ఆర్ధికంగా నష్టపోయినట్లే.. ఈ పని చేస్తే మీ డబ్బులు ఆదా..

Updated on: May 04, 2026 | 8:33 AM

దేశంలో యూపీఐ పేమెంట్స్ రోజురోజుకు పెరుగతున్నాయి. రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. అయితే యూపీఐ లావాదేవీల వల్ల సెకన్లలోనే పేమెంట్స్ చేసే సౌలభ్యం ఉన్నప్పటికీ.. దీని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. చిన్న మొత్తాలు నెల చివరకు పెద్దగా అనిపిస్తాయి.

1 / 5
ప్రస్తుతం ప్రతీఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ఉంటుంది. దీంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం కూడా సులువైంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా సెకన్లలోనే నగదు బదిలీ చేసే అవకాశం ఉండటంతో జనాలందరూ అలవాటు పడిపోయారు. చేతిలో ఫిజికల్ క్యాష్‌ను ఉంచుకునేవారు తగ్గిపోయారు. రూ.10 ఛాయ్ నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోట యూపీఐ సౌకర్యం తప్పనిసరిగా ఉండటంతో.. యూపీఐ మన రోజువారీ జీవితంలో ఒక భాగమైంది.

2 / 5
అయితే రూ.10 చెల్లించడానికి కూడా యూపీఐ వాడుతున్నారు. ఇవి చూడటానికి తక్కువ అయినప్పటికీ.. నెల చివరి నాటికి ఎక్కువవుతాయి.  దీంతో మీ నెలవారీ బడ్జెట్ దెబ్బతింటుంది. ఇలాంటి చిన్న మొత్తాల వల్ల వాస్తవంగా ఎంత ఖర్చు పెడుతున్నామనేది లెక్క కట్టడం కూడా కష్టమే. చిన్న పేమెంట్స్ ప్రణాళిక లేని ఖర్చులకు దారితీస్తుంది. ఇలంటి చిన్న మొత్తాలు విడివిడిగా చూస్తే పెద్దగా అనిపించవు. కానీ అన్నీ కలిపితే ఖర్చు భారీగా అనిపిస్తుంది.

3 / 5
రోజు టీ కోసం చేసే రూ.10, ఫుడ్ ఆర్డర్ కోసం చేసే రూ.200 చూసుకుంటే.. నెల చివరి నాటికి వేలల్లో ఖర్చు అవుతుంది. చిన్న పేమెంట్స్ అని పట్టించుకోవడం మానేస్తే నెల చివరకు మీకు భారం అనిపిస్తుంది. చిన్న లావాదేవీలను మానసికంగా లెక్కించడం అరుదు. కానీ అన్నీ కలిపినప్పుడువ పొదుపును పాడు చేస్తాయి. మీ ఆర్ధిక ప్రణాళికలను దెబ్బతీసి మీ నెలవారీ ఖర్చు పెరిగేలా చేస్తాయి.

4 / 5
అదే మీరు భౌతికంగా డబ్బులు చెల్లిస్తే.. మీ కళ్లతో ప్రత్యక్షంగా నగదు చూస్తారు. దీని వల్ల ఖర్చులో మీకు అదుపు ఉంటుంది. యూపీఐ ద్వారా ఎప్పుడైనా చెల్లింపులు చేయవచ్చు. ఆఫర్లు, డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల ఖర్చులు పెరిగిపోయి ఆర్ధికంగా నష్టపోతారు. ఇక యూపీఐ లావాదేవీలు వివిధ యాప్‌లలో చేస్తూ ఉంటారు. దీంతో ట్రాకింగ్ కూడా కష్టమవుతుంది.

5 / 5
మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను ప్రతీ నెలా చెక్ చేసుకోండి. దీంతో మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే స్పష్టత ఉంటుంది. ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవచ్చనే అవగాహన ఏర్పడుతుంది. యూపీఐ పేమెంట్స్ చేసేవారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తెలియని ఖర్చులను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు వీటిని పాటించి మీ ఖర్చును తగ్గించుకోండి.

Follow Us