
కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.70 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.75 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,550 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.1,54,750 వద్ద ఉంది.

వెండిలో హెచ్చుతగ్గులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని వల్ల షార్ప్ మూమెంట్స్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుద్ద భయాల తగ్గడం వల్ల బంగారం ధరలు తగ్గవచ్చు. కానీ వెండికి ఇండస్ట్రీయల్ అవసరాల్లో ఉపయోగిస్తున్నందున ఎప్పటికీ డిమాండ్ కొనసాగుతూ ఉంటుంది. ఇదే వెండికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీంతో బంగారం కంటే జోరుగా వెండికి క్రేజ్ ఉంటుందని అంటున్నారు.

సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవీ వెహికల్స్ తయారీలో వెండికి బాగా డిమాండ్ పెరుగుతోంది. ఇక సెంట్రల్ బ్యాంకులు కూడా వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ కారణంతో బంగారం కంటే వెండికి రానున్న రోజుల్లో డిమాండ్ పెరగడం వల్ల రిటర్న్స్ కూడా వచ్చే అవకాశముంది. దీంతో సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షన్‌గా చెబుతున్నారు.

రాబోయే 6 నుంచి 12 నెలల్లో వెండిలో పెట్టుబడి పెట్టినవారికి రిటర్న్స్ ఎక్కువ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెండిలో పెట్టుబడి పెట్టినవారికి లాభాలను తెచ్చిపెట్టే అవకాశముందని అంటున్నారు. వెండి సురక్షితమైన పెట్టుబడిగా మారవచ్చని, పెట్టుబడులు మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా దీనికి డిమాండ్ ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దీంతో వెండిలో పెట్టుబడి పెడితే కాసుల వర్షం కురుస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం బంగారం ధరలు స్ధిరంగా కొనసాగుతోండగా.. సిల్వర్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ద భయాలు కాస్త తగ్గడం, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ రంగాల్లో వెండి వినియోగం పెరగడంతో వీటి ధరలు కొండెక్కుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో బంగారం కంటే వెండి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో వెండికి మరింత క్రేజ్ పెరుగుతుందని అంటున్నారు