
Silver Price: ప్రస్తుతం వెండి ధర దిగి వస్తున్నప్పటికీ రానున్నన రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కిలో వెండి ధర 4 లక్షల రూపాయలు దాటగా, ప్రస్తుతం భారీగానే దిగి వచ్చింది. గత నెల రోజుల నుంచి ఏకంగా లక్ష రూపాయల వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం రూ. 3 లక్షల చేరువలో కొనసాగుతోంది.

2026 నాటికి ఒక కిలో వెండి ధర రూ.500,000కు చేరుకోవచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) చైర్మన్ రాజేష్ రోక్డే అభిప్రాయపడ్డారు. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ.200,000 కు చేరుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం GSTని తగ్గించి బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గిస్తే ధరలు కూడా తగ్గవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ ధరలను పరిశీలిస్తే, రాయిటర్స్ ప్రకారం, వెండి స్పాట్ ధర ఔన్సుకు 2.2 శాతం పెరిగి $82.43కి చేరుకుంది. US ట్రెజరీ బాండ్ దిగుబడి తగ్గడం బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలను పెంచింది.

రాబోయే రోజుల్లో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బును దాచుకునేవారి కంటే.. నిజమైన విలువ ఉన్న ఆస్తుల్లో అంటే బంగారం, వెండి మొదలైనవి పెట్టుబడి పెట్టినవారే లాభపడతారు. ఈ విషయాన్ని గమనించి, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

11 ఫిబ్రవరి 2026న, భారతదేశంలో వెండి ధరలు హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కిలోకు సుమారు రూ.2,90,000 నుండి రూ.3,00,000 వరకు ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్, స్థానిక డిమాండ్ కారణంగా వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇటీవల కాలంలో వెండి ధర భారీగా పెరిగింది.