Credit Cards: ఏప్రిల్ 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు.. వాడేవారందరికీ అలర్ట్

Updated on: Mar 17, 2026 | 11:01 AM

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. వీటి గురించి క్రెడిట్ కార్డుల యూజర్లు అందరూ తెలుసుకోవాల్సిన విషయముంది. లేకపోతే ఆర్దికంగా నష్టపోవచ్చు. అసలు క్రెడిట్ కార్డు నియమాల్లో కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి వస్తున్న మార్పులేంటో చూద్దాం.

1 / 5
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? అయితే మీకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ పూర్తిగా మారిపోతున్నాయి. బ్యాంకులు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానున్నాయి. క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లు, లావాదేవీ ఫీజుల్లో పలు మార్పులు రానున్నాయి. మీరు క్రెడిట్ కార్డులు వాడుతుంటే వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం

2 / 5
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నియమాలను మార్చాయి. ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఏప్రిల్ 12  నుంచి కొత్త సేవలు నిలిచిపోనున్నాయి.  జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ లావాదేవీలకు 10 శాతం క్యా్ష్ బ్యాక్ ఆగిపోనుంది. దీనికి బదులుగా బ్లింకిట్, జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో 10 శాతం వాల్యూ బ్యాంక్ ఆఫర్ ప్రవేశపెట్టనున్నారు.

3 / 5
ఇక ప్రతీ బల్లింగ్ సైకిల్‌కు గరిష్ట క్యాష్ బ్యాంక్ పరిమితి బేస్ క్యాష్ బ్యాక్ క్యాప్‌తో అనుసంధానం అవుతుందని యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇక యస్ బ్యాంక్ గ్యాస్ బుకింగ్, వాటర్, కరెంట్ వంటి బిల్లులపై పరిమితులు విధించనుంది. అవి దాటితే 1 శాతం ఛార్జీ వసూలు చేయనున్నారు. అలాగే టోట్, బ్రిడ్జ్ చెల్లింపులు కూడా 1 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.

4 / 5
ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. నెలకు గరిష్టంగా 60 వేల రివార్డ్ పాయింట్స్ మాత్రమే స్టేట్ మెంట్ క్రెడిట్‌గా రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక 4 వేల పాయింట్ల గుణిజాల్లో మత్రమే రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ ఉంటుంది.  అయితే కొన్ని రకాల కార్డులపై ఈ నిబంధనలు వర్తించవు.

5 / 5
ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త క్రెడిట్ కార్డు నియమాల గురించి ఎస్బీఐ, యాక్సిస్, ఎస్ బ్యాంక్ వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయముంది. కస్టమర్లు అందరూ ఈ మార్పుల గురించి అవగాహన కలిగి ఉండాలని బ్యాంకులు సూచించాయి. లేకపోతే చెల్లింపుల విషయంలో నష్టపోవాల్సి ఉంటుంది.

Follow Us