SBI: ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. ఇకపై నెలకు నాలుగు మాత్రమే.. అక్టోబర్ 1 నుంచి నిబంధనలు ఇవే..

Updated on: Sep 27, 2026 | 3:19 PM

ఏటీఎం విత్ డ్రా ఛార్జీలపై ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది. ఏటీఎం విత్ డ్రా ఉచిత లావాదేవీల విషయంలో కొత విధించింది. ఇక నుంచి నెలకు నాలుగు మాత్రమే ఉచితంగా నిర్వహించుకోవచ్చు.

1 / 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏటీఎం విత్ డ్రా రూల్స్ మారబోతున్నాయి. ఏటీఎం ద్వారా డెబిట్ కార్డు ఉపయోగించి చేసే విత్ డ్రాలపై ఎస్బీఐ కొత విధించింది. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు ఉన్నవారు నెలకు నాలుగు మాత్రమే ఉచిత ఏటీఎం లాదాదేవీలు నిర్వహించుకోవచ్చు. బ్రాంచ్ కెనాల్ ద్వారా తెరిచే అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.

2 / 5
ప్రతీ నెలా ఏటీఎంల ద్వారా నాలుగు ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత చేసే ట్రాన్సాక్షన్లకు ప్రతీ లావాదేవీకి రూ.15తో పాటు జీఎస్టీ కూడా పడుతుంది. ఈ మేరకు ఎస్బీఐ ఈ చార్జీల గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక డిజిటల్ లావాదేవీలు ఉచితంగానే చేసుకోవచ్చని, ఎలాంటి ఛార్జీలు ఉండవని ఎస్బీఐ పేర్కొంది.

3 / 5
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా చేసే లావాదేవీల్లో కూడా ఎస్బీఐ మార్పులు చేసింది. గతంలో AePS లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా పరిగణించేవారు. దీంతో నెలవారీ ఉచిత విత్ డ్రా పరిమితిలో దానిని కూడా చేర్చేవారు. అయితే SBI ఇప్పుడు ఈ మినహాయింపును తొలగించింది. దీంతో AePS లావాదేవీలను ఇక నుంచి భిన్నంగా పరిగణిస్తారు.

4 / 5
ఇక శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఏటీఎం విత్ డ్రా పరిమితిలో ఆంక్షలు విధిస్తుంది. గతంలో ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో నెలకు 10 ఉచిత లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండగా.. ఇఫ్పుడు దానిని 5కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐదు ఉచిత లావాదేవీల తర్వాత చేసే ప్రతీ విత్ డ్రాకు రూ.23తో పాటు జీఎస్టీ పడుతుంది. ఇతర ట్రాన్సాక్షన్లకు రూ.11తో పాటు జీఎస్టీ పడుతుంది.

5 / 5
అటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె క్రమంలో ఏటీఎం విత్ డ్రాలపై పరిమితులను ఎస్బీఐ ఎత్తివేసింది. ఆ మూడు రోజుల పాటు ఏటీఎం ద్వారా చేసే ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు పడవని తెలిపింది. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో ఎ న్ని లావాదేవీలు చేసినా ఛార్జీలు ఉండవని, వాటిని మాఫీ చేస్తామని ప్రకటించింది. సమ్మె క్రమంలో ఖాతాదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది

Loading...
Unable to load recommendations.
Follow Us