ATM Charges: బ్యాంక్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. ఏటీఎం లావాదేవీలన్నీ ఫ్రీ.. ఛార్జీలు ఉండవ్..

Updated on: Sep 25, 2026 | 4:24 PM

తమ కస్టమర్లకు ఎస్బీఐ భారీ శుభవార్త అందించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడ్రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టనున్న క్రమంలో బ్యాంక్ శాఖలు బంద్ కానున్నాయి. ఒకవేళ తెరిచి ఉన్నా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది.

1 / 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. ఈ క్రమంలో ఎస్బీఐ తమ కస్టమర్లకు ఊరట కలిగించింది. సమ్మె జరిగే ఈ మూడు రోజుల పాటు ఏటీఎంల్లో ఉచిత లావాదేవీలు అందించనున్నట్లు ప్రకటించింది. ఏటీఎంల ద్వారా ఎన్ని లావాదేవీలు చేసినా ఎలాంటి ఛార్జీలు విధించమని వెల్లడించింది.

2 / 5
ఎస్బీఐ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. మూడు రోజుల పాటు తమ బ్యాంక్ బ్రాంచ్‌లన్నీ తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. 28 నుంచి 30వ తేదీ వరకు దేశంలోని ఏ బ్యాంక్ ఏటీఎంల నుంచి లావాదేవీలు చేసినా ఛార్జీలను మాఫీ చేయనున్నట్లు తెలిపింది. ఎస్బీఐ ఖాతాదారులు ఏ బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించుకున్నా ఎలాంటి ఛార్జీలు విధించమని, ఉచితంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఛార్జీలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది

3 / 5
సమ్మె జరిగే మూడు రోజుల్లో బ్యాంక్ కార్యకలాపాలకు అంతరాయం కలిగే అవకాశముంది. దీంతో కస్టమర్లు ఏటీఎంల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించుకోవాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఏటీఎం ఛార్జీల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. ఛార్జీల మాఫీకి సంబంధించిన ఖచ్చితమైన నిబంధనలు, షరతుల కోసం బ్యాంక్ జారీ చేసిన ప్రకటనను తనిఖీ చేయాలని పేర్కొంది.

4 / 5
సమ్మెకు ముందే బ్రాంచ్ సంబంధిత లావాదేవీలను పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. వీలైనంత వరకు ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకోవాలని తమ వినియోగదారులకు సూచించింది. ఏటీఎంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలంది. ఇంటర్నెట్, మొబైల్, వాట్సప్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ విధానాల ద్వారా చెల్లింపులు చేయవచ్చంది.

5 / 5
అయితే 27వ తేదీన ఆదివారం బ్యాంకులను తెరిచి ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిని కలవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఆదివారం పనిదినంగా ప్రకటిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. హాజరయ్యే ఉద్యోగులకు రెట్టింపు జీతంతో పాటు నష్టపరిహార సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us