గ్లోబల్ మార్కెట్‌లో వరుసగా లగ్జరీ బైక్స్‌ను రిలీజ్ చేస్తోంది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ (Royal Enfield). ఈ క్రమంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త సూపర్ మీటోర్ 650 క్రూయిజర్ బైక్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ ఫీచర్స్, ధర వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
క్లాసిక్ బైక్‌ల తయారీలో అగ్రగామిగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ మీటోర్ 650 బైక్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది.
ఈ కొత్త బైక్ మోడల్ ఆస్ట్రల్, ఇంటర్‌స్టెల్లార్, సెలెస్టియల్ అనే మూడు వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఢిల్లీ ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.49 లక్షల నుంచి రూ. 3.79 లక్షల వరకూ ఉంది.
కొత్త బైక్‌లో 648 cc, ట్విన్-సిలిండర్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉన్న 47 హార్స్‌పవర్.. 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అద్భుతమైన డిజైన్‌తో ఉన్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ మోడల్ 2260 mm పొడవు, 890 mm వెడల్పు, 1155 mm ఎత్తు, 1500 mm వీల్ బేస్, 135 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో మొత్తం 214 కిలోల బరువు ఉంది.
కొత్త బైక్‌లో మాక్జిమమ్ సెక్యూరిటీ కోసం 320 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 300 mm వెనుక డిస్క్ బ్రేక్‌తో పాటు డ్యూయల్ ఛానెల్ ABS, 15.7 లీటర్ కెపాసిటి గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉన్నాయి.
ఇంకా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 బైక్‌లో USD ఫోర్క్, లాంగ్ ఫ్రంట్ విండ్ స్క్రీన్, టూరింగ్ సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్, LED హెడ్ లైట్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.