
ప్రముఖ టెలికాం దిగ్గజమైన రిలయన్స్ జియో ఇటీవల వరుసగా కొత్త కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్లాన్లను ప్రవేశపెడుతోంది. డిస్కౌంట్స్, ఆఫర్లు లాంటివి ఇస్తూ ఉంది. ఇక తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే రీఛార్జ్ ప్లాన్లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా జియో అత్యంత చవకైన డేటా ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ వివరాలు ఇప్పుడు చూద్దాం

రిలయన్స్ జియో చౌకైన బూస్టర్ డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ డేటా పొందవచ్చు. డేటా ఎక్కువ వాడేవారి కోసం జియో ఈ ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.49 మాత్రమే. కానీ ఏకంగా 25జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే ఉంటుంది. ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్‌గా చెప్పవచ్చు. ఇక 25జీబీ హైస్పీడ్ డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. కాల్స్ అవసరం లేకుండా కేవలం డేటా మాత్రమే కావాలనుకునేవారికి ఇది మంచి రీఛార్జ్ ప్లాన్‌గా చెప్పవచ్చు.

ఇక ఈ ప్లాన్‌లో కాల్స్, ఎస్‌ఎంఎస్ సౌకర్యాలు లభించవు. ఈ బూస్టర్ డేటా ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఇప్పటికే ఏదైనా బేసిక్ ప్లాన్ కలిగి ఉండాలి. కొంతమందికి వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసం ఎక్కువ డేటా అవసరమవుతుంది. వారికి ఇది అద్బుత ప్లాన్‌గా చెప్పవచ్చు.

ఇక కొంతమంది సినిమాలు, గేమ్స్ వంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో డేటా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి కూడా ఈ రూ.49 డేటా ప్లాన్ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. అటు జియో రూ.123 ప్లాన్ కూడా తీసుకొచ్చింది. ఇది రోజుకు 0.5జీబీ అందిస్తోంది.