Bank Account: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ప్రతీరోజూ రూ.5 వేలు పొందోచ్చు.. ఇదొక్క రూల్ తెలిస్తే చాలు..

Updated on: Oct 17, 2026 | 9:10 AM

బ్యాంకులకు ఆర్బీఐ కొత్త రూల్స్ విధించింది. వినియోగదారులకు బ్యాంక్ సేవలను అందించడంలో జాప్యం చేస్తే కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యం చేసిన ప్రతీ రోజుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ సేవలను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ ఈ రూల్స్ ప్రవేశపెట్టింది.

1 / 5
బ్యాంకింగ్ సేవలను వేగవంతం చేయడం, కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్బీఐ అనేక రూల్స్ అమలు చేస్తోంది. బ్యాంక్ సేవలను సజావుగా, వేగంగా అందించేందుకు బ్యాంకులకు డెడ్ లైన్ విధించింది. ప్రతీ సేవకు ఒక గడువు ఇచ్చింది. ఈగడువులోగా ఖాతాదారుడికి సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ గడువు మించితే ఖాతాదారుడికి రోజువారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

2 / 5
ఏటీఎం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లాంటి డిజిటల్ లావాదేవీలు విఫలమైనప్పుడు మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యితే ఐదు రోజుల్లోగా తిరిగి జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ తర్వాత రోజు రూ.100 చొప్పున కస్టమర్‌కు బ్యాంకులు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుడికి కలిగిన నష్టానికి గాను బ్యాంకులు ఇలాంటి పరిస్థితుల్లో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

3 / 5
 మీరు లోన్ తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజుల్లోపు మీరు తాకట్టు పెట్టిన ఆస్తి పత్రాలు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ గడువులోగా తిరిగి ఇవ్వకపోతే వినియోగదారుడికి ప్రతీ రోజుకు రూ.5 వేల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 13, 2023న ఈ నిబంధనలను ఆర్బీఐ తీసుకొచ్చింది. ఇక డాక్యుమెంట్స్ పోయినా లేదా పాడైపోయినా రోజుకు రూ.5 వేలతో పాటు డూప్లికేట్ పత్రాలను పొందటంలో బ్యాంక్ సహాయం చేయాల్సి ఉంటుంది.

4 / 5
క్రెడిట్ కార్డు క్రోజర్ రిక్వెస్ట్ 7 రోజుల్లోగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఆ తర్వాత ప్రతీరోజుకు రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ లాకర్‌లో పెట్టిన వస్తువులకు నష్టం జరిగితే వార్షిక అద్దెకు 100 రెట్లు పరిహారం అందించాలి. బ్యాంక్ నిర్లక్ష్యం, అగ్నిప్రమాదం, దొంగతనం, మోసాల కారణంగా లాకర్‌కు నష్టం జరిగితే పరిహారం చెల్లించాలి.

5 / 5
ఉదాహరణకు బ్యాంక్ లాకర్ వార్షిక అద్దె రూ.3 వేలుగా ఉంటే.. గరిష్టంగా రూ.3 లక్షలు పొందవచ్చు. క్రెడిట్ రిపోర్టులో వివాదం ఉంటే 30 రోజుల్లోగా పరిష్కరించాలి. లేకపోతే రోజుకు రూ.100 చొప్పున వినియోగదారుడికి పరిహారం అందించాల్సి ఉంటుంది. చాలామంది ఖాతాదారులకు ఈ విషయాలు తెలియక వినియోగించుకోలేకపోతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us