
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. వీటిల్లో ప్రజలు పెట్టుబడులు పెడితే అధిక లాభం పొందవచ్చు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అందుతాయి. దీంతో ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్‌లో డబ్బులు పొదుపు చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నిధి కావడంతో డబ్బులకు భద్రత ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు

ప్రభుత్వం నడుపుతున్న పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) అనేది చాలా పాపులర్. ఏదైనా బ్యాంకులో మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. నెలకు రూ.500 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనికి 15 ఏళ్ల లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ లాకింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో ఒకేసారి సొమ్ము మీ చేతికి అందుతుంది

అయితే మీరు ఒక బ్యాంకులో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశారంటే వేరే బ్యాంకులో లేదా పోస్టాఫీలో ఓపెన్ చేయడం కుదరదు. ఒకవేళ మీరు ఓపెన్ చేసినా దానిని ఇర్రెగ్యులర్ అకౌంట్‌గా పరిగణిస్తారు. రెండు అకౌంట్లు కలిగి ఉంటే రెండోసారి తెరిచిన అకౌంట్‌ను పరిగణలోకి తీసుకోరు. దీంతో ఎలాంటి వడ్డీ మీకు లభించదు.

అయితే మీరు ఒకవేళ రెండు పీపీఎఫ్ అకౌంట్లు వేర్వేరు బ్యాంకుల్లో ఓపెన్ చేసి ఉంటే ఆ రెండింటిని మీరు మెర్జ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి అధికారులను సంప్రదించి మీరు ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్లు కలిగి ఉంటే ఒక అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవడం మంచిది.

ప్రైమరీ పీపీఎఫ్ అకౌంట్‌కు మాత్రమే వడ్డీ లభిస్తుంది. రెండో అకౌంట్‌కు ఎలాంటి వడ్డీ రాదు. దీంతో రెండో అకౌంట్‌లోని నగదును తొలి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇక 18 ఏళ్లలోపు మైనర్లకు తల్లిదండ్రులు ప్రత్యేక పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని చెప్పవచ్చ.