Post Office: సీనియర్‌ సిటిజన్స్‌ కోసం పోస్టల్‌ శాఖ గుడ్‌న్యూస్‌.. నిబంధనలు మార్పుల చేస్తూ కీలక నిర్ణయం..!

|

Aug 21, 2021 | 10:00 AM

Post Office: భారత పోస్టల్‌ శాఖ ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో పోస్టుకార్డులకే పరిమితంగా ఉన్న పోస్టాఫీసులు.. తాజాగా ఎన్నో రకాల ..

1 / 6
Post Office: భారత పోస్టల్‌ శాఖ ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో పోస్టుకార్డులకే పరిమితంగా ఉన్న పోస్టాఫీసులు.. తాజాగా ఎన్నో రకాల సదుపాయాలను అందిస్తున్నాయి. ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా పలు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

2 / 6
ఇక తాజాగా పోస్టాఫీసుల్లో లభించే వివిధ సౌకర్యాలను సీనియర్‌ సిటిజన్స్‌ పొందలేకపోతున్నారు. వారి అనారోగ్యం, వయసు మీద పడటం తదితర కారణాల వల్ల వారు పోస్టాఫీసులకు వచ్చి పనులు చేసుకోలేకపోతున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పోస్టల్‌ శాఖ సీనియర్‌ సిటిజన్స్‌ విషయంలో పలు నిబంధనలు మార్పు చేసింది.

3 / 6
సీనియర్‌ సిటిజన్స్‌ పోస్టాఫీసుకు రావడం కష్టంగా మారుతుండటంతో  మరింత ప్రయోజనం కల్పించే విధంగా చేస్తోంది పోస్టల్ శాఖ. అయితే పోస్టాఫీసుల్లో వివిధ రకాల స్కీమ్‌లు, ఖాతాలు ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌ మాత్రమే పోస్టా్‌ఫీసుకు వచ్చి పనులను చేసుకోవాల్సి ఉంటుంది.

4 / 6
ఇక నుంచి సీనియర్‌ సిటిజన్స్‌ పోస్టాఫీసుకు రాకుండా వారి స్థానంలో వారి వారసులు, లేదా, సంబంధికులు ఎవరైనా వచ్చి వారి పనులను పూర్తి చేసుకోవచ్చని పోస్టల్‌ శాఖ వెల్లడించింది.

5 / 6
మూసివేత, డిపాజిట్‌, విత్‌డ్రా తదితర పనులను వారసులు వచ్చి చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. సీనియర్‌ సిటిజన్స్‌ పనులను వారి వారసులు చేయాలంటే పలు నియమాలు పాటించాలి ఉంటుంది. ముందుగా ఖాతాదారుడు ఫారం -12 పూరించాలి. అలాగే పోస్టుమాస్టర్‌కు లేఖ రాయాలి. ఖాతాదారుడి స్థానంలో మరో వ్యక్తికి విత్‌డ్రా, ప్రీ క్లోజర్‌, లోన్స్‌ మొదలైన పనులు చేసే హక్కులు కల్పించాలని సీనియర్‌ సిటిజన్స్‌ లేఖలో పేర్కొనాలి.

6 / 6
అందుకు సంబంధించిన సీనియర్‌ సిటిజన్స్‌ ఆధార్‌, ఇతర పత్రాలు, వారసుడి ఆధార్‌ ఇతర పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత పోస్టల్‌ శాఖ వారసుడికి ఖాతాదారుడి హక్కులు కల్పిస్తారు. అప్పుడు సీనియర్‌ సిటిజన్స్‌ పోస్టాఫీసులకు వెళ్లకుండా ఆయన సూచించిన వ్యక్తి పోస్టాఫీసుకు వెళ్లి విత్‌డ్రా, రుణ సదుపాయం, డిపాజిట్‌ తదతర పనులు చేసుకోవచ్చు.