Aadhaar Card: ఆధార్ కార్డులో మూడోసారి పేరు మార్చుకోవాలా..? ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీ..

Updated on: Aug 06, 2026 | 6:15 PM

ఆధార్ కార్డులో పేరు తప్పులు లేకుండా సరిగ్గా ఉండటం అనేది చాలా ముఖ్యం. పేరు ఆధార్ కార్డులో ఒకలా.. మిగతా పత్రాల్లో మరోలా ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే రెండుసార్లు మాత్రమే యూఐడీఏఐ నిబంధనల ప్రకారం పేరు మార్చుకోవచ్చు. మూడోసారి మార్చుకోవాలంటే..

1 / 5
ఆధార్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ ముఖ్యమైన డాక్యుమెంట్. దీంతో ఇందులో వివరాలు అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం పధకాలతో పాటు ఇతర సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉంటే ఆన్‌లైన్ ద్వారా సులువుగా మార్చుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. యూఐడీఏఐ వెబ్‌సైట్ లేదా ఆధార్ యాప్ ద్వారా ఎక్కడినుంచైనా సింపుల్‌గా వివరాలు మార్చుకోవచ్చు. కొంత మొత్తంలో రుసుంలు చెల్లించి ఆన్‌లైన్ విధానంలో అప్డేట్ చేసుకోవచ్చు.

2 / 5
అయితే కొన్ని వివరాలు అప్డేట్ చేసుకోవడంపై పరిమితులు ఉంటాయి. మీ పేరు జీవితకాలంలో రెండుసార్లు మాత్రమే ఆధార్‌లో మార్చుకోవచ్చు. రెండుసార్లు మార్చుకున్న తర్వాత కూడా ఏదైనా తప్పుగా పడితే మూడోసారి కూడా అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. కానీ ఇందుకు కఠినమైన ప్రాసెస్ ఉంటుంది. మూడోసారి మార్చుకోవాలంటే యూఐడీఏఐ ఎక్సెప్షన్ అప్డేట్ ప్రక్రియను ఫాలో అవ్వాలి. ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

3 / 5
మూడోసారి ఆధార్‌లో పేరు మార్చుకోవాలంటే ముందుగా మీ సమీపంలో సేవా సెంటర్‌కు వెళ్లండి. అప్డేట్ దరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి. మీ దరఖాస్తు ఆమోదం పొందకపోతే ఎక్సెప్షన్ అప్‌డేట్ ప్రక్రియ ద్వారా మార్చుకోవాలి. ఇందుకోసం  help@uidai.gov.in మెయిల్ ఐడీకి మీ సమస్యను వివరిస్తూ మెయిల్ పెట్టండి. సేవా కేంద్రాల్లో రిజెక్ట్ అయిన ఆధార్ అప్డేట్ అభ్యర్థన సంఖ్య(URN), మొబైల్ నెంబర్, ధృవీకరణ పత్రాలు, పేరు మార్చుకోవడానికి కారణం లాంటి వివరాలను అందించండి.

4 / 5
మీ సమాచారాన్ని యూఐడీఏఐ సేకరించి కేసును సమీక్షిస్తుంది. కారణాలు నిజమేనని తేలితే ఎక్సెప్ష్ అప్డేట్ కింద తదుపరి ప్రక్రియను యూఐడీఏఐ చేపడుతుంది. ఇక యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నెంబర్ 1947 సంప్రదించి కూడా సహాయం పొందవచ్చు. అయితే మూడోసారి పేరు అప్డేట్ చేసుకోవాలంటే ప్రాసెస్ క్లిష్టతరంగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌కు ఎక్కవ రోజుల సమయం పడుతుంది.

5 / 5
మీ పేరును పదే పదే ఆధార్‌లో మార్చుకోకండి. ఒకసారి అప్డేట్ చేసుకునేముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి. అప్డేట్ చేసుకునేటప్పుడు చెల్లుబాటు అయ్యే ధృవీకరణ పత్రాలను సమర్పించండి. దరఖాస్తు నింపేటప్పుడు మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ భద్రపర్చుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us