Train Ticket Booking: రైలు టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు.. టికెట్‌ కన్ఫర్మ్‌ అవుతుందా.. లేదా ? ముందే తెలిపే AI టెక్నాలజీ

Updated on: Jul 18, 2026 | 2:59 PM

Indian Railways: కేవలం టికెట్ కన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా, ఈ సూపర్ యాప్ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనేక సేవలను అందిస్తోంది. రిజర్వ్‌డ్, అన్-రిజర్వ్‌డ్ టికెట్లు: జనరల్ టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు ఒకే యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు. అలాగే స్టేషన్‌కు వెళ్లకముందే మొబైల్‌లోనే..

1 / 5
 Indian Railways: భారత రైల్వే. ఇది దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. మన భారత రైల్వే ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు, అలాగే టికెట్‌ బుకింగ్‌లో మరింత సులభతరం చేసేందుకు కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైల్వే శాఖ ఇప్పుడు RailOne యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కూడా ఎన్నో మార్పులు చేసింది. టికెట్‌ బుకింగ్‌ శాతాన్ని కూడా పెంచింది రైల్వే. గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు స్థాయిలో బుకింగ్‌ వ్యవస్థను తీసుకువచ్చింది.

2 / 5
 భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. గతంలో రైలు టికెట్ బుక్ చేసుకున్నాక అది కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రైల్వే శాఖ ప్రవేశపెట్టిన RailOne మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోకముందే అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

3 / 5
 AI సాంకేతికతతో ఖచ్చితమైన అంచనా: రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ‘RailConnect’, ‘UTS’ వంటి పాత యాప్‌ల స్థానంలో RailOne అనే సూపర్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో ఉన్న ప్రధాన ఫీచర్ ఏంటంటే.. మీరు వెయిటింగ్ లిస్ట్ ఉన్న టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విశ్లేషించి చెబుతుంది.

4 / 5
 గతంలో ఈ అంచనా ఖచ్చితత్వం 53 శాతంగా ఉండగా, ఇప్పుడు దాన్ని 94 శాతానికి పెంచారు. దీనివల్ల ప్రయాణికులు అనవసరంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకుని ఇబ్బంది పడకుండా, ప్రత్యామ్నాయ రైళ్లను చూసుకోవచ్చు.

5 / 5
 RailOne యాప్‌లో లభించే ఇతర సేవలు: కేవలం టికెట్ కన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా, ఈ సూపర్ యాప్ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనేక సేవలను అందిస్తోంది. రిజర్వ్‌డ్, అన్-రిజర్వ్‌డ్ టికెట్లు: జనరల్ టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు ఒకే యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు. అలాగే స్టేషన్‌కు వెళ్లకముందే మొబైల్‌లోనే ప్లాట్‌ఫారమ్ టికెట్ పొందవచ్చు. రైలు ఎక్కడుంది? ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణ సమయంలో నేరుగా మీ సీటు వద్దకే భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు. సింగిల్ సైన్-ఆన్ (SSO): ప్రతి సేవకు వేర్వేరు లాగిన్ అవసరం లేకుండా ఒకే ఖాతాతో అన్ని సేవలను పొందవచ్చు. రైల్వే శాఖ ఆగస్టు 2026 నాటికి తన పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను పూర్తిగా ఆధునీకరించి, ఈ కొత్త హై-స్పీడ్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత బలోపేతం చేయనుంది.

Follow Us