Best bikes: స్లైలిష్ బైక్ కోసం చూస్తున్నారా..?మార్కెట్‌లో ది బెస్ట్ ఇవే..!

|

Oct 27, 2024 | 7:45 PM

ఆధునిక కాలంలో ద్విచక్ర వాహనం ప్రతి ఒక్కరికీ కనీస అవసరంగా మారింది. ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు, ఇంటి అవసరాల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లో అనేక కంపెనీల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలు, యువత, పెద్ద వాళ్ల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. ముఖ్యంగా యువతకు కావాల్సిన స్టైల్, లుక్, ఫీచర్లతో అనేక బైక్ లు సందడి చేస్తున్నాయి. కాలేజీకి వెళుతున్న కుర్రకారు, అప్పుడే ఉద్యోగాలు పొందిన యువత మొదటి ప్రాధాన్యం మోటారు సైకిల్ కే ఉంటుంది. కాబట్టి మొదటి సారి వాహనం కొనుగోలు చేసేవారు ద్విచక్ర వాహనాలపై పెద్ద రీసెర్చ్ చేస్తారు. ఇలాంటి వారికోసం స్పెషల్ ఫీచర్లు, స్లైలిష్ లుక్ తో పాటు అందుబాటులో ధరలో అనేక వాహనాలు ఉన్నాయి. యువత కోసం మార్కెట్ లో రూ.1.50 లక్షలకు దొరుకుతున్న బెస్ట్ ద్విచక్ర వాహనాలు ఇవే.

1 / 5
టీవీఎస్ విడుదల చేసిన అపాచీ ఆర్ టీఆర్ 160 బైక్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్, వెనుక భాగంలో మోనోషాక్ ఫోర్కుల సెటప్ అమర్చారు. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, 270, 130 ఎంఎం డిస్కు బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ బండి సుమారు 42 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిలోని 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 17.30 హెచ్ పీ, 14.73 టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఈ మోటారు సైకిల్ ప్రారంభ ధర రూ.1.24 లక్షలు, టాప్ ట్రిమ్ వేరియంట్ కోసం రూ.1.39 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఖర్చవుతుంది.

2 / 5
దేశ ప్రజలందరికీ సుపరిచితమైన హీరో కంపెనీ విడుదల చేసిన ఎక్స్ట్రీమ్ 160 ఆర్ వీ స్లైలిష్ లుక్ తో కనిపిస్తోంది. దీనిలో 163.2 సీసీ సింగిల్ సిలిండర్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 16.6 హెచ్ పీ, 14.6 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, ముందు యూఎస్ డీ, వెనుక మోనోషాక్ ఫోర్కులు, 276, 220 డిస్క్ బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ అదనపు ప్రత్యేకతలు. లీటర్ కు 48 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ మోటారు సైకిల్ రూ.1.38 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది.

3 / 5
హోండా ఎస్పీ 160 మోటారు సైకిల్ దాాదాపు 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సింగిల్ చానల్ ఏబీఎస్, 276, 220 ఎంఎం డిస్కు బ్రేకులు, టెలిస్కోపిక్ , మోనోషాక్ ఫోర్కులు, ఐదు స్పీడ్ గేర్ బాక్స్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలోని 162.71 సీసీ సింగిల్ సిలిండర్ నుంచి 13.27 హెచ్  పీ, 14.58 టార్క్ ఉత్పత్తి అవుతుంది. హోండా ఎస్పీ 160 మోటారు సైకిల్ ధర రూ.1.18 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.23 లక్షల వరకూ ఉంది.

4 / 5
స్లైలిష్ లుక్ తో ఆకట్టుకునే వాహనాల్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 ఒకటి. దీనిలోని 160.3 సీసి సింగిల్ సిలిండర్ నుంచి 17.03 హెచ్ పీ, 14.6 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, వెనుక నైట్రోక్స్ మోనోషాక్, ముందు టెలిస్కోలిప్ ఫోర్కులు, 260 ఎంఎం, 230 ఎంఎం డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ తదితర ప్రత్యేకతలున్నాయి. లీటర్ కు 52.2 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ మోటారు సైకిల్ రూ.1.47 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.

5 / 5
యమహా ఎఫ్ జెడ్ - ఎస్ ఎఫ్ఐ వెర్ 4.0 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 149 సీసీ సింగిల్ సిలిండర్ నుంచి 12.2 హెచ్ పీ, 13.3 టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ టాన్స్ మిషన్, సస్పెన్షన్ డ్యూటీలు, అడ్జస్టబుల్ మోనోషాక్, టెలిస్కోపిక్ ఫోర్కులు, 282, 200 ఎంఎం డిస్కులు, సింగిల్ చానల్ ఏబీఎస్ దీని ప్రత్యేకతలు. ఈ మోటారు సైకిల్ రూ.1.30 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది.