
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కస్టమర్లకు గుడ్ న్యూస్. ఎల్‌ఐసీ తమ కస్టమర్లరు వేగవంతమైన సేవలు అందించేందుకు రెండు కొత్త యాప్‌లను తీసుకొచ్చింది. వినియోగదారులతో పాటు ఏజెంట్లకు కూడా ఈ యాప్‌లు ఉపయోగపడనున్నాయి. కస్టమర్ల కోసం మైఎల్‌ఐసీ యాప్ లాంచ్ చేయగా.. ఏజెంట్ల కోసం సూపర్ సేల్స్ సౌథీ యాప్ ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ రెండు యాప్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఈ కొత్త యాప్‌ల వల్ల మీరు ఎల్‌ఐసీ సేవల కోసం బ్రాంచులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కూర్చోనే మొబైల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో సేవలు పొందవచ్చు. ప్రీమియం చెల్లింపులు, పాలసీల నిర్వహణ, కొత్త పాలసీల కొనుగోలు వంటివి దీని ద్వారానే చేయవచ్చు. వీటి వల్ల ఎల్ఐసీ బ్రాంచుల వద్ద గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది.

ఇక మీరు మీ పాలసీపై ఆన్‌లైన్ ద్వారానే లోన్ తీసుకోవచ్చు. ఇక ల్యాప్స్ లేదా ఆగిపోయిన పాలసీను మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు. అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. మరోవైపు మీ పాలసీకి సంబంధించి సమాచారంతో పాటు కొత్త పాలసీలు సులువుగా తీసుకోవచ్చు. ఇలా మైఎల్‌ఐసీ యాప్ కస్టమర్లకు ఉపయోగపడుతుంది.

అలాగే సూపర్ సేల్స్ సౌథీ యాప్‌లో ఏజెంట్ల కోసం అనేక ఫీచర్ల ఉంటాయి. పాలసీదారుల ప్రీమియం చెల్లింపులను ఏజెంట్లు చూడవచ్చు. అలాగే పాలసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ సేవలు కూడా ఏజెంట్లు పొందవచ్చు. ఏఐ ద్వారా పాలసీ హోల్డర్లకు సమచారం అందించవచ్చు.

ఇప్పటివరకు ఎల్‌ఐసీ వెబ్ సైట్ ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్ సేవలు పొందేవారు. మీ పాలసీ వివరాలు చూసుకోవడంతో పాటు పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే కొత్త పాలసీలు తీసుకోవచ్చు. కానీ పోర్టల్‌లో అన్నీ సేవలు అందుబాటులో లేవు. ఇప్పుడు యాప్ ద్వారా బ్రాంచులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారానే సేవలు పొందవచ్చు.