
మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు పడిపోయాయి. కొన్ని గంటల్లో పసిడి ధరలు తారుమారు అయ్యాయి. ఇరాన్‌తో ఈ నెల 18న శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. ట్రంప్ ప్రకటన మార్కెట్ వర్గాలకు ఊరటనిచ్చింది.

ట్రంప్ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్లు పాజిటివ్ ధోరణిలో వెళ్లడంతో ముదుపరులు సూచీలవైపు మళ్లారు. ఈ క్రమంలో బంగారానికి డిమాండ్ తగ్గడంతో ధరలు పతనమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

దేశ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,51,100 వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.270 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,38,500 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.250 మేర కుప్పకూలింది. ఇక హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.1,51,100గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,500 వద్ద కొనసాగుతోంది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,060 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ రూ.320 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,300 వద్ద కొనసాగుతోంది. నేడు రూ.300 మేర పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,51,250 గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,650 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక సిల్వర్ ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.75 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇక చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.75 లక్షల వద్ద కొనసాగుతోంది.