
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ఇష్యూపై బిగ్ డెసిషన్ వెలువడిన తర్వాత బంగారం ధరలు పడిపోతున్నాయి. ఎటువంటి మార్పులు చేయకుండా పాత వడ్డీ రేట్లనే యథాతథంగా ఉంచుతూ ఫెడ్ రిజర్వ్ చేసిన తాజాగా ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లలో ఎలాంటి కోత విధించకుండా 3.5 శాతం నుంచి 3.75 శాతం దగ్గరే స్థిరంగా ఉంచింది అమెరికా ఫెడరల్ రిజర్వ్. ఈ మేరకు కీలక మీటింగ్‌లో వడ్డీ రేట్ల అంచనాలపై ఫైనల్‌గా ఫెడ్ క్లారిటీ వచ్చింది. ఫెడ్ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కెవిన్ వార్ష్ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఫైనాన్షియల్ మీటింగ్ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఉత్కంఠ నెలకొంది.

వడ్డీ రేట్లు తగ్గిస్తారని అంతా భావించిన టైంలో ఎలాంటి మార్పు లేకుండా కెవిన్ వార్ష్ యాక్షన్ తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉన్న ఎకానమీ గ్రోత్, ద్రవ్యోల్బణం రేట్లపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న టైంలో ఈ తాజా అప్‌డేట్ వచ్చింది. మార్కెట్ నిపుణుల అంచనాలకు తగ్గట్టుగానే ఎకానమీని బ్యాలెన్స్ చేయడానికి రేట్లను హోల్డ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బంగారం ధరలు దిగొస్తు్న్నాయి.

గురువారం బంగారంతో పాటు వెండి ధరలు డౌన్ అయ్యాయి. దేశీయ బులియన్ మార్కెట్లలో పసడి ధరలు వరుసగా పతనమవుతూ వస్తోన్నాయి. జూన్ 16న రూ.150 తగ్గగా.. జూన్ 17న రూ.250 పడిపోయాయి. ఇక ఇవాళ కూడా కుప్పకూలాయి. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,100 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,500 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.1,51,100గా, 22 క్యారెట్ల రేటు రూ.1,38,500 వద్ద ఇవాళ ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,53,800గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,600 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్లు రూ.1,51,250గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,650 వద్ద కొనసాగుతున్నాయి.

వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.2.65 లక్షలుగా ఉండగా.. ఒక్కరోజే రూ.5 వేల మేర పడిపోయాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.70 లక్షలుగా ప్రస్తుతం ఉంది. నిన్న నగరంలో రూ.2.75 లక్షల వద్ద ఉంది.