
బంగారం రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గత రెండు రోజులుగా తగ్గగా.. మంగళవారం భారీగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఉద్రిక్తతలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంపై కొనసాగుతున్న అనిశ్చితి వల్ల బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో తెలియక కన్‌ప్యూజన్‌లో పడుతున్నారు

మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,53,930 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఇది రూ.1,52,460గా ఉండగా.. ఇవాళ ఏకంగా రూ.1470 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,39,750గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1350 పెరిగిందని చెప్పవచ్చు.

ఇక చెన్నైలో ఏకంగా గోల్డ్ రేటు మరింత పెరిగింది. నిన్న రూ.1,53,380గా ఉండగా.. ఇప్పుడు రూ.1,55,130కి చేరుకుంది. అంటే రూ.1750 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతోండగా.. సోమవారం ఇది రూ.1,40,600 వద్ద కొనసాగింది. ఇవాళ రూ.1600 పెరిగింది.

అటు ఢిల్లీలో 24 క్యారెట్ల రేటు చూస్తే రూ.1,54,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,930 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,100 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. చెన్నైలో నిన్న రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.2.65 లక్షలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కూడా రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.