Land Rover: ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ వీ8 బాండ్‌ ఎడిషన్‌ వచ్చేస్తోంది.. లంబోర్గిని ఉరుస్‌కు ధీటుగా..!

|

Sep 03, 2021 | 8:46 AM

Land Rover: మార్కెట్లో రోజురోజుకు కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు కంపెనీలు. అతి ..

1 / 5
Land Rover: మార్కెట్లో రోజురోజుకు కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు కంపెనీలు. అతి తక్కువ సమయంలోనే అతివేగంగా ప్రయాణించే వాహనాలను తీసుకువస్తున్నాయి.

2 / 5
టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) డిఫెండర్‌ వీ8 బాండ్‌ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్‌ 30న విడుదల కానున్న జేమ్స్‌ బాండ్‌ సినిమా ‘నో టైమ్‌ టు డై’ వేడుకల్లో భాగంగా ఈ ఎడిషన్‌కు రూపకల్పన చేసింది.

3 / 5
రహదారి మార్గాల్లో లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్‌ఎస్‌క్యూ8, బీఎండబ్లయ్యూ ఎక్స్‌ 5ఎమ్‌ తరహాలో ఫర్మామెన్స్‌ చేస్తున్న డిఫెండర్‌ వీ8 బాండ్‌  300 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది.

4 / 5
5.0 లీటర్‌ సూపర్‌చార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్, 386 కిలోవాట్‌ పవర్, 625 ఎన్‌ఎం టార్క్, 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. 50.80 సెంటీమీటర్ల సాటిన్‌ డార్క్‌ గ్రే వీల్స్‌తో ఎక్స్‌టెండెడ్‌ బ్లాక్‌ ప్యాక్, సిగ్నేచర్‌ జినాన్‌ బ్లూ ఫ్రంట్‌ బ్రేక్‌ కాలిపర్స్, డిఫెండర్‌ 007 రేర్‌ బ్యాడ్జ్‌ పొందుపర్చారు.

5 / 5
డిఫెండర్‌ వీ8 90 వేరియంట్‌ 5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు.