
New Jio Plan: టెలికాం రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio), తన వినియోగదారుల కోసం మరో సంచలన ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం తక్కువ ధరకే అపరిమిత డేటా, కాల్స్ అందించడమే కాకుండా, ఊహించని రీతిలో భారీ విలువైన డిజిటల్ సేవలను ఉచితంగా అందిస్తోంది.

రూ.339 ప్లాన్ విశేషాలు: సాధారణంగా నెలవారీ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. కానీ ఈ కొత్త ప్లాన్ పూర్తి క్యాలెండర్ నెల (31 రోజులు) పాటు అందుబాటులో ఉంటుంది. అంటే 28 రోజులకు బదులుగా నెలలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

డేటా: ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited Calls) చేసుకోవచ్చు. ఇక ఎస్‌ఎంఎస్‌ల విషయానికొస్తే రోజుకు 100SMSలు ఉచితం. అంతేకాదు అదనంగా రూ.14.95 విలువైన టాక్ టైమ్ బ్యాలెన్స్ కూడా ఖాతాలో జమ అవుతుంది.

భారీ ఉచిత ఆఫర్లు: ఈ ప్లాన్ ధర తక్కువైనప్పటికీ, ఇందులో లభించే అదనపు ప్రయోజనాలు మాత్రం అత్యంత విలువైనవి. గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro): సుమారు రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇది AI వినియోగదారులకు ఒక గొప్ప వార్త.

భారీ క్లౌడ్ స్టోరేజ్: మీ ఫోటోలు, వీడియోలు భద్రపరుచుకోవడానికి 5000 GB (5TB) క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. నానో బనానా (Nano Banana): అత్యాధునిక ఇమేజ్, క్రియేటివ్ టూల్ అయిన 'నానో బనానా' సేవలకు కూడా ఈ ప్లాన్ ద్వారా యాక్సెస్ లభిస్తుంది. అలాగే జియో టీవీ (JioTV), జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud) వంటి యాప్స్ ఉచితంగా వాడుకోవచ్చు. డేటా, కాలింగ్‌తో పాటు, ఏఐ (AI) సేవలను, భారీ స్టోరేజీని కోరుకునే వారికి ఈ రూ.339 ప్లాన్ ఒక వరం లాంటిది. ముఖ్యంగా విద్యార్థులు, టెక్ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.