
దేశంలో తొలి బుల్లెట్ రైలు తయారీ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌తో తొలి ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇందుకోసం తొలి బుల్లెట్ రైలును అభివృద్ది చేస్తున్నారు. BEML బెంగళూరు కేంద్రంలో దీని తయారీ చేపడుతుండగా.. దీనికి సంబంధించిన ఫీచర్లను వివరిస్తూ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ రైల్లో 8 కోచ్‌లు ఉండనుండగా.. ఒకేసారి 557 మంది ప్రయాణించవచ్చు.

ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. ట్రాక్‌లపై 249 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఈ రైలు 202 మీటర్ల పొడవు ఉంటుంది. శారీరక వైకల్యం ఉన్నవారి కోసం ప్రత్యేక స్థలాలు, వాష్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 8 కోచుల్లో నాలుగు ట్రైలర్ కార్లు, నాలుగు మోటార్ కార్లు ఉంటాయి. 7 స్టాండర్డ్-క్లాస్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్-క్లాస్ కోచ్ 2×2 సీటింగ్ సామర్థ్యంతో ఉంటుంది.

ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్ది కోచ్‌లను విస్తరించుకోవచ్చు. 8 కోచ్‌ల రైలు సెట్లను కలిపి 18 కోచ్‌లుగా మార్చుకోవచ్చు. ఎల్ఈడీ లైట్లు, ఓవర్ హెడ్ బ్యాగేజ్ ర్యాక్‌లు, పెద్ద బ్యాగ్‌ల కోసం నేలపై అదనపు లగేజ్ స్టాండ్లు, ఎర్గోనామికల్ డిజైన్‌తో కూడుకున్న సీట్లు, ల్యాప్ టాప్‌లతో పాటు మొబైల్స్ కోసం ప్రత్యేక అవుట్ లెట్లు, విశాలమైన కిటికీల వంటి ఫీచర్లు ఈ బుల్లెట్ ట్రైన్లో ఉంటాయి. అలాగే అత్యాధునిక బయో డైజెస్టర్ టాయిలెట్లు, కోచ్‌లను అనుసంధానించేందుకు సీల్డ్ గ్యాంగ్వేు ఉంటాయి.

వివిధ భాషల్లో సమాచారం అందించేందుకు ప్రత్యేక సమాచార వ్యవస్థ ఉంటుంది. ఇందుకోసం ట్రైన్ లోపల ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో సమాచారం అందిస్తారు. ఇక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సిబ్బందిని ప్రయాణికులు సంప్రదించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ యూనిట్లు కూడా ఉంటాయి. ఇక వైఫై సౌకర్యంతో పాటు వినోదం కోసం లోడ్ చేయబడిన కంటెంట్ అందుబాటులో ఉంటుంది.

ప్రతీ కోచ్‌లో రెండు హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ యూనిట్లు ఉంటాయి. ఇక ఏరోడైనమింగ్ ఫెయిరింగ్‌లు, బోగీ కవర్లు శబ్దాన్ని తగ్గిస్తాయి. ఇవి ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ రైలు 25 kV, 50 Hz సింగిల్-ఫేజ్ ఆల్టర్నేటింగ్-కరెంట్ ట్రాక్షన్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దేశీయ టెక్నాలజీతో ఈ రైలు అభివృద్ది చేస్తున్నారు.