Indian Railways: రైళ్లల్లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ ఆప్షన్ అసలు మర్చిపోవద్దు.. ఇలా చేస్తే పొందే ఛాన్స్..

Updated on: Oct 30, 2026 | 12:19 PM

రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు లోయర్ బెర్త్‌ను ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే పై బెర్త్‌కి ఎక్కాలంటే కాస్త సమస్యగా ఉంటుంది. అదే లోయర్ బెర్త్‌లో అయితే హాయిగా బయటి ప్రాంతాలను చూస్తూ ప్రయాణించవచ్చు. అయితే సీనియర్ సిటిజన్లు, గర్బిణులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు లోయర్ బెర్త్‌ కేటాయింపుల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

1 / 5
వయో వృద్దులు, గర్బిణులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోంది రైల్వేశాఖ. వీరికి బెర్త్‌ల కేటాయింపుల్లో ప్రయారిటీ ఇస్తోంది. వీరి కోసం ప్రత్యేకంగా లోయర్ బెర్త్ కోటా అమలు చేస్తోంది. సీనియర్ సిటిజన్లు, గర్బిణులు పైన ఉండే బెర్త్‌లకు ఎక్కలేరు. దీంతో వీళ్లు రైళ్లల్లో లోయర్ బెర్త్‌లు పొందవచ్చు. వీరి కోసం రైల్వేశాఖ పరిమిత సంఖ్యలో ప్రత్యేక బెర్త్‌లు కేటాయిస్తోంది. ఈ ప్రత్యేక కోటా తక్కువ సంఖ్యలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ లోయర్ బెర్త్‌లు వచ్చే అవకాశం ఉండదు.

2 / 5
ఒక్కొ క్లాసులో ఒక్కొలా సీనియర్ సిటిజన్లు, గర్బిణులు, 45 ఏళ్లుదాటిన మహిళల కోసం ప్రత్యేక రిజర్వ్ బెర్త్‌లు ఉంటాయి. స్లీపర్ క్లాసుల్లో ప్రతీ బోగీలో 6 నుంచి 7 లోయర్ బెర్త్‌లు, థర్డ్ ఏసీలో 4 నుంచి 5 బెర్త్‌లు, సెకండ్ క్లాస్ రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్‌మెంట్‌లో 3 నుంచి 4 బెర్త్‌లు రిజర్వ్ చేసి ఉంటాయి. ప్రయారిటీ ప్రకారం ముందుగా బుకింగ్ చేసుకున్నవారికి ఈ బెర్త్‌లు దక్కుతాయి. పరిమితి దాటాక సాధారణ ప్రయాణికుల్లాగే వీరికి సిస్టమ్ ఆటోమేటిక్‌గా బెర్త్‌ల కేటాయింపు జరుపుతుంది.

3 / 5
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునే సమయంలో వయస్సును సరిగ్గా నమోదు చేయాలి. లోయర్ బెర్త్ ఎంపిక సెలక్ట్ చేసుకోవాలి. ప్రయాణికుడి పేరు, వయస్సు సరిగ్గా నమోదు చేయడం ద్వారా లోయర్ బెర్త్ పొందే అవకాశముంటుంది. వయస్సు ఆధారంగా లోయర్ బెర్త్‌ల కేటాయింపు ఉంటుది కాబట్టి వయస్సు తప్పుగా నమోదు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మర్చిపోకుండా లోయర్ బెర్త్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.

4 / 5
లోయల్ బెర్త్ ఆప్షన్ ఎంచుకున్నంత మాత్రాన ఖచ్చితంగా ఆ బెర్త్‌నే వస్తుందని చెప్పలేం. ప్రయాణికుల రద్దీ, సంఖ్య, రైల్వే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. లోయర్ బోర్త్ లభించదని అనుకున్న పక్షంలో ప్రత్యామ్నాయ రైలు లేదా వేరే సమయాన్ని ఎంచుకోవడం మంచిది.  మీరు ఏ రైల్లో అయితే ప్రయాణిస్తున్నారో.. ఆ రైల్లో అందుబాటులో ఉన్న బెర్త్‌ల లభ్యతను ముందుగా తనిఖీ చేసుకోవాలి. క్లాస్‌ను బట్టి సీట్ల లభ్యత మారుతూ ఉంటుంది. బుకింగ్ సమయంలో మీరు బుక్ చేసుకునే క్లాసులో సీట్ల లభ్యత గురించి చెక్ చేయండి

5 / 5
టికెట్ల బుకింగ్ ప్రారంభమైన వెంటనే బుకింగ్ ప్రక్రియ మొదలుపెడితే లోయర్ బెర్త్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రయాణం సమయంలో లోయర్ బెర్త్ ఖాళీ అయితే టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించి ఆ సీటు పొందవచ్చు. ఇక రైల్వే స్టేషన్లలో వృద్దుల కోసం ప్రత్యక వీల్ చైర్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us