EPFO Withdraw: స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. కేవలం నిమిషాల్లోనే.. ఎలానో చూడండి..

Updated on: Jan 25, 2026 | 4:36 PM

ఈపీఎఫ్ అకౌంట్లోని డబ్బులను యూపీఐ యాప్స్ ద్వారా విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఏప్రిల్ నుంచి దీనిని ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులను యూపీఐ ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవాలో చూద్దాం.

1 / 5
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు అందరూ పీఎఫ్ సౌకర్యం కలిగి ఉంటారు. దేశంలో కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. వీరికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైనేషన్(EPFO) అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో మరో నూతన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ నుంచి పీఎఫ్ విత్ డ్రా మరింత సులువు కానుంది.

2 / 5
కొత్త ఆర్ధిక సంవత్సరం 2026-27 మొదలుకానున్న ఏప్రిల్ నుంచి స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను నిమిషాల్లోనే అత్యంత సులువుగా విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా యూపీఐ యాప్స్ ఉపయోగించి డబ్బులను తీసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు సంబంధించి పీఎఫ్ 3.0 వెర్షన్‌లో మార్పులు చేస్తోంది. దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్ ప్రక్రియ జరుగుతోంది.

3 / 5
పీఎఫ్ ఖాతాలను బ్యాంక్ అకౌంట్లతో అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులు యూపీఐ యాప్స్ ద్వారా మనీ ఉససంహరించుకోవచ్చు. ఇక ఆర్వాత ఏటీఎం ద్వారా కూడా తీసుకునే అవకాశం కల్పించనుంది. తొలుత యూపీఐ ద్వారా తీసుకునే సౌకర్యం రానుండగా.. ఆ తర్వాత ఏటీఎం ద్వారా ఉససంహరించుకునే వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.

4 / 5
ప్రస్తుతం ఎక్కువమంది పీఎఫ్‌లో వస్తున్న  ఈ మార్పుల గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో గూగుల్ ట్రెండ్స్‌లో ఈపీఎఫ్ 3.0 అనేది ట్రెండింగ్‌గా మారింది. ఈ మార్పుల గురించి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అప్డేట్స్ ఎప్పుడెప్పుడా వస్తాయా అని సెర్చ్ చేస్తున్నారు.

5 / 5
ఈ క్రమంలో పీఎఫ్ 3.0 అంశం గూగుల్‌లో ట్రెండింగ్ అవుతోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా పీఎఫ్ సేవలను డిజిటలైజ్ చేసే కార్యక్రమానికి ఈపీఎఫ్‌వో  శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సాంప్రదాయ విధానానికి స్వస్తి పలికి డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తసీుకురానుంది. దీంతో ఇక నుంచి ఈపీఎఫ్ సేవల్లో వేగం పెరగనుంది.