
బ్యాంకులు స్థిరమైన ఆదాయం కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే క్రెడిట్ కార్డులు జారీ చేస్తూ ఉంటాయి. శాలరీ పొందేవారు, వ్యాపారం చేసేవారికి క్రెడిట్ కార్డులు అందిస్తాయి. ఇక ఏదైనా స్థిరమైన ఆదాయం ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు ఇస్తాయి. ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో క్రెడిట్ కార్డులు పొందవచ్చు

అయితే ఇండియాలో విద్యార్థులకు క్రెడిట్ కార్డులకు వస్తాయా.. లేదా.. అంటే.. విద్యార్థులకు స్థిరమైన ఆదాయం ఉండదు. చదువు, హాస్టల్ వసతి, ఇతర ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడతారు. వారికి ఆదాయం లేకపోయినా భారతదేశంలో క్రెడిట్ కార్డులు పొందచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో విద్యార్థులు క్రెడిట్ కార్డులు పొందవచ్చు. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ తెరిస్తే. క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. ఫిక్స్ డ్ డిపాజిట్‌కు సమానంగా క్రెడిట్ కార్డు లిమిట్ ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్‌ను ఆదాయంగా పరిగణించి బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి.

ఒకవేళ క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఫిక్స్ డ్ డిపాజిట్ నుంచి జమ చేసుకుంటాయి. ఇక యాడ్ ఆన్ కార్డు విధానంలో కూడా క్రెడిట్ కార్డ్ పొందవచ్చు. తల్లిదండ్రులు ప్రధాన హోల్డర్‌గా ఉండి విద్యార్థికి అదే అకౌంట్‌తో అనుసంధానించబడ్డ క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. ఇక ఫిన్ టెక్ కంపెనీలు ఎంట్రీ లెవల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి.

ఫిన్‌టెక్ యాప్‌ల నుంచి ఈ క్రెడిట్ కార్డులు విద్యార్థులు తీసుకోవచ్చు. చిన్న డిపాజిట్ లేదా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ అవసరం వీటికి ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్‌ను పోలి ఈ విధానం ఉంటుంది. విద్యార్థులు తమ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో రుణాలు పొందేందుకు సహాయపడుతుంది.