Home Loan: హోమ్ లోన్ రావాలంటే ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి..? ఇలా అయితే తక్కువ వడ్డీకే రుణం..

Updated on: Apr 27, 2026 | 9:16 PM

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది బ్యాంక్ లోన్లపైనే ఆధారపడుతుంటారు. అయితే మంచి జీతం ఉంది కదా.. హోమ్ లోన్ ఈజీగా వచ్చేస్తుందని అనుకుంటే మీరు పొరబడినట్లే.. డాక్యుమెంట్ల కంటే ముఖ్యంగా బ్యాంకులు చూసేది మీ క్రెడిట్ స్కోర్. ఈ స్కోర్ సరిగ్గా లేకపోతే మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అసలు హోమ్ లోన్ కోసం క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి? అనేది తెలుసుకుందాం..

1 / 5
క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?: క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక క్రమశిక్షణను తెలిపే 300 నుండి 900 మధ్య ఉండే అంకె. మీరు గతంలో తీసుకున్న అప్పులను, క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎంత బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నారో ఇది తెలియజేస్తుంది. దేశంలో దీనిని ఎక్కువగా సిబిల్ స్కోర్ అని పిలుస్తారు. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్ వంటి సంస్థలు ఈ స్కోర్‌ను గణిస్తాయి.

2 / 5
హోమ్ లోన్ కోసం ఎంత స్కోర్ ఉండాలి?: సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు రుణం ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. మీ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, మీరు బ్యాంకులకు అత్యంత నమ్మకమైన కస్టమర్‌గా కనిపిస్తారు. దీనివల్ల తక్కువ వడ్డీ రేటుకే రుణం లభించే అవకాశం ఉంటుంది. 600 కంటే తక్కువ ఉన్న వారికి లోన్ రావడం దాదాపు అసాధ్యం. ఒకవేళ వచ్చినా వడ్డీ రేట్లు అత్యధికంగా ఉంటాయి.

3 / 5
కేవలం స్కోర్ ఉంటే సరిపోతుందా?: బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు కేవలం క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే చూడవు. మీ స్థిరమైన ఆదాయం, మీ దగ్గర ఉన్న ఆస్తులు, మీరు కొనబోయే ఆస్తి విలువను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. మీరు కొనబోయే ఇంటి విలువను బ్యాంక్ ప్రతినిధులు స్వయంగా తనిఖీ చేస్తారు. ఆస్తిపై ఉన్న న్యాయపరమైన చిక్కులను కూడా పరిశీలిస్తారు ఇవన్నీ సంతృప్తికరంగా ఉన్నప్పుడే లోన్ మంజూరు అవుతుంది.

4 / 5
లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వడ్డీ రేటు ఒక్కటే చూడకండి: కేవలం వడ్డీ రేటు తక్కువగా ఉందని లోన్ తీసుకోకండి. ప్రాసెసింగ్ ఫీజులు, హిడెన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, ఆలస్యంగా చెల్లిస్తే పడే జరిమానాల గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి. మీరు లోన్ ముందే తీర్చేయాలనుకుంటే ఏవైనా పెనాల్టీలు ఉన్నాయా? అనేది తెలుసుకోవాలి.

5 / 5
కాలపరిమితి: లోన్ కాలపరిమితి ఎక్కువగా ఉంటే ప్రతి నెలా కట్టే EMI తక్కువగా ఉంటుంది, కానీ మీరు చెల్లించే మొత్తం వడ్డీ పెరుగుతుంది. కాలపరిమితి తక్కువగా ఉంటే EMI భారమైనా, వడ్డీ భారం తగ్గుతుంది. మీ ఆర్థిక స్తోమతను బట్టి సరైన నిర్ణయం తీసుకోంది. లోన్ కోసం దరఖాస్తు చేసే ముందే మీ పాత క్రెడిట్ కార్డ్ బకాయిలు లేదా ఇతర చిన్న చిన్న లోన్లు ఉంటే వాటిని క్లియర్ చేసి, మీ స్కోర్‌ను మెరుగుపరుచుకోండి.

Follow Us