
మారుతీ సుజుకి సెలెరియో ఎస్-సీఎన్‌జీ(Maruti Suzuki Celerio Cng).. ఈ కారు మారుతి సుజుకి సీఎన్‌జీ లైనప్‌లో అత్యధిక మైలేజి ఇస్తుంది. ఒక కేజీ సీఎన్‌జీ గ్యాస్‌కి 35.60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.73 లక్షలు. దీనిలో 55.92 బీహెచ్‌పీ పవర్, 82.1ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0ఎల్ కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది.

మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ ఎస్-సీఎన్‌జీ(Maruti Suzuki Wagonr Cng).. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు ఇది. దీనిలో 55.92 బీహెచ్‌పీ పవర్, 82.1ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0ఎల్ కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది కేజీ సీఎన్‌జీ ఇంధనానికి 35.05 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.43 లక్షలు.

మారుతీ సుజుకి ఆల్టో కే-10 ఎస్-సీఎన్‌జీ(Maruti Suzuki Alto K 10 Cng).. మారుతి సుజుకి తన ప్రసిద్ధ ఆల్టో హ్యాచ్‌బ్యాక్ ఆల్టో కే10 సీఎన్‌జీ వెర్షన్‌ను గత సంవత్సరం మన దేశంలో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.96 లక్షలు. మైలేజీ కిలో సీఎన్‌జీ ఇంధనానికి 33.85 కిలోమీటర్లు వస్తుంది. దీనిలోని ఇంజిన్ 55.92 బీహెచ్‌పీ 82.1ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతీ సుజుకి ఎస్‌ప్రెస్సో ఎస్-సీఎన్‌జీ(Maruti Suzuki S Presso Cng).. దేశంలో చవకైన కార్లలోఇది ఒకటి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.90 లక్షలు. కేజీ సీఎన్‌జీ ఇంధనపై 32.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనిలో 55.92 బీహెచ్‌పీ పవర్, 82.1ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0ఎల్ కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది.

మారుతీ సుజుకి ఆల్టో 800 ఎస్-సీఎన్‌జీ(Maruti Suzuki Alto 800 Cng).. అత్యంత చవకైన సీఎన్‌సీ కారు ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.13 లక్షలు. ఒక కేజీ సీఎన్‌జీ ఇంధనంతో 31.59 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. ఈ కారులోని 800సీసీ పెట్రోల్ ఇంజన్ 40.3 బీహెచ్‌పీ పవర్, 60ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.