Health Insurance: ఆరోగ్య బీమా రంగంలో కరోనాతో పెరిగిపోతున్న క్లెయిమ్‌లు… ప్రీమియంలు పెంచే ఆలోచన..!

|

Apr 20, 2021 | 8:23 PM

Health Insurance: కరోనా మహమ్మారి కారణంగా క్లెయిమ్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా రంగంలోని కంపెనీలు ప్రీమియంలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ..

1 / 5
Health Insurance: కరోనా మహమ్మారి కారణంగా క్లెయిమ్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా రంగంలోని కంపెనీలు ప్రీమియంలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుదల శాతాన్ని అరికట్టేకపోతే ప్రీమియంలు 20 శాతం వరకు పెంచాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

2 / 5
కరోనాకు సంబంధిత ఉత్పత్తులు, ఇతర కాంప్రహెన్సివ్‌ బీమా ఉత్పత్తుల కొనుగోళ్లు పెరగడంతో ఆరోగ్య బీమా రంగంలోకి కంపెనీల ఆదాయం 2020లో రూ.40 వేల కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆరోగ్య బీమా కంపెనీలన్నింటి ఉమ్మడి ప్రీమియం వసూళ్లు 15-20 శాతం పెరిగాయి. అలాగే కోవిడ్‌ సంబంధిత క్లెయిమ్‌లు మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియం కలెక్షన్‌లో 30 శాతం మేరకు ఉన్నాయి.

3 / 5
మరోపక్క ఇతర ఆపరేషన్లను రోగులు వాయిదా వేసుకోవడం వల్ల కొంత మేరకు ఆరోగ్య బీమా పాలసీల ద్వారా వచ్చిన నష్టం సర్దుబాటు అయ్యింది. కరోనా తీవ్రత ఇలాగే కొనసాగితే కొవిడ్‌-19 పాలసీలను కంపెనీలు మార్పులతో దాఖలు చేసి 20 శాతం మేరకు ప్రీమియంలు పెంచుకునేందుకు అనుమతి కోరవచ్చని ప్రతినిధులు అంటున్నారు. మార్చి నెలలోనే పెరుగుతున్న కరోనా కేసులకు దీటుగా క్లెయిమ్‌లు కూడా పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి.

4 / 5
ఇక పరిశ్రమల గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం కరోనా క్లెయిమ్‌లు రూ.17 వేల కోట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా భయంతో అధికశాతం మంది బీమా రక్షణ కోరుతూ పాలసీలు తీసుకునే అవకాశం ఉన్నందున క్లెయిమ్‌లు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

5 / 5
ఇలా కరోనా కారణంగా బీమా  చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే బీమా క్లెయిమ్‌ల సంఖ్య కూడా చాలా వరకు పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా రంగంలో ప్రీమియంలను పెంచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హెల్త్‌ పాలసీలు పెద్దగా చేసుకోని వారు ఇప్పుడు కారోనా కారణంగా పాలసీలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది.