
Gold, Silver Prices: బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త ఉంది. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఇటీవల తులం ధర కొనుగోలు చేయాలంటే రూ.1.60,000పైగా చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టింది.

తాజాగా జూన్ 6వ తేదీన కొన్ని గంటల్లోనే భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 3000 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2750 రూపాయలు తగ్గింది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 2250 రూపాయలు దిగి వచ్చింది.

ఇక బంగారం ధర తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.1,52,730 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,40,000 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,14,550 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

అలాగే వెండి ధర విషయానికొస్తే ఇది కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. భారీగా తగ్గుముఖం పట్టింది. వెండిపై ఏకంగా 10 వేల రూపాయల వరకు దిగి వచ్చిన తర్వాత ప్రస్తుతం కిలో వెండి ధర 2,65,000 లకు పడిపోయింది.

జూన్ 5న అమెరికాలో స్పాట్ బంగారం 3.2 శాతం తగ్గి ఔన్సుకు $4,330.10కి పడిపోయింది. వెండి 7.1 శాతం తగ్గి ఔన్సుకు $68.63కి చేరింది. ఇక భారతదేశంలోని MCX కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ఫ్యూచర్స్, వెండి ఫ్యూచర్స్‌లో భారీ క్షీణత కనిపించింది. బంగారం ఫ్యూచర్స్ 2.05 శాతం అంటే రూ. 3,189 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,52,551 వద్ద ముగిసింది. వెండి ఫ్యూచర్స్ 6.27 శాతం అంటే రూ. 16,595 తగ్గి, కిలోకు రూ. 2,48,201 వద్ద ముగిసింది.