
పండక్కి ముందు బంగారం ధరలపై ఒక్కసారి సీన్ రివర్స్ అయింది. దసరా పండుగ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండనగా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాయి. ధరలు ఒక్కసారిగా పెరిగి నిరాశపర్చాయి. ఈ వారం ప్రారంభం నుంచి ప్రతీరోజు ధరలు పడిపోతుండగా.. ఇవాళ తగ్గుదలకు బ్రేక్ పడింది. శనివారం గంటల వ్యవధిలోనే ధరలు పుంజుకున్నాయి. అక్టోబర్ 17న లేటెస్ట్ ధరలు చూద్దాం

హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,47,660 వద్ద కొనసాగుతోంది. ఇవాళ రూ.220 మేర పెరిగాయి. అటు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,350గా పలుకుతుండగా.. నేడు రూ.200 పెరుగుదలను నమోదు చేశాయి. విజయవాడ,విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,810 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,500కు లభిస్తోంది. చెన్నైలో 24 క్యారెట్లు ధర రూ.1,47,660గా, 22 క్యారెట్ల రేటు రూ.1,35,350గా పలుకుతోంది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,660కు లభిస్తోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,350 వద్ద కొనసాగుతోంది. అటు ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి.

బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.30 లక్షలుగా ఉండగా.. హైదరాబాద్లో రూ.2.40 లక్షలుగా ఉంది. అటు ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది. దసరా, దీపావళి వరుస పండుగల క్రమంలో బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువమంది కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. దీని వల్ల ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.