
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది బ్యాడ్ న్యూసే. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలుకావడంతో గోల్డ్ కొనుగోలుచేసేవారు పెరిగిపోయారు. దీంతో బంగారం సేల్స్ మళ్లీ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో పసిడి ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇటీవల వరుసగా ధరలు పడిపోగా.. రెండు రోజులుగా మళ్లీ హైక్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,43,950 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1200 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,31,950గా ఉండగా.. శనివారం రూ.1100 హైక్ అయ్యాయి. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ రూ.770 పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,33,700 వద్ద ఉండగా.. నేడు రూ.700 మేర పెరుగుదల నమోదు చేసింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,950 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,950 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,400 వద్ద కొనసాగుతోండగా.. శనివారం రూ.1150 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,32,100గా ఉండగా.. నేడు రూ.1050 పెరుగుదల నమోదు చేసింది. అటు ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,950 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,950గా ఉంది.

ఇక వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇక చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2.40 లక్షల వద్ద ఉంది. అటు ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలుగా కొనసాగుతోంది.