Gold Prices: బంగారం ధరలు మరింత డౌన్.. త్వరలో ఊహించనంతగా పతనం..! అసలు లెక్కలివే..

Updated on: Jul 16, 2026 | 8:38 AM

బంగారం ధరలపై శుభవార్త. ధరలు రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. రికార్డ్ దిశగా దూసుకెళ్లే అవకాశాలు ఇప్పట్లో లేవని అంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలే దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి.

1 / 5
బంగారం ధరలపై ఎగిరి గంతేసే న్యూస్. ధరలు తగ్గితే కొనుగోలు చేసేందుకు చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. దీంతో రోజూ ధరలనూ పరిశీలిస్తూ ఉంటారు. భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే అంచనాలను తెలుసుకుంటూ ఉంటారు. జనవరిలో గోల్డ్ రేట్లు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకోగా.. ఆ తర్వాత కొద్దికొద్దిగా పడిపోతూ వస్తోన్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా.. ఇప్పుడు మళ్లీ క్రాష్ అవుతూ వస్తోన్నాయి. అయితే జనవరి 2026 నాటి రికార్డు స్థాయి గరిష్ఠ ధరలకు మళ్లీ చేరుకునే అవకాశం తక్కువగా ఉందని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు.

2 / 5
అంతర్జాతీయ మార్కెట్‌ను పర్యవేక్షించే ఫిచ్ సొల్యూషన్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక పరిశోధనా విభాగమైన BMI తన తాజా నివేదికలో కీలక అంచనాలు వెలువరించింది. 2026 సంవత్సరానికి  బంగారం సగటు ధరపై గతంలో వేసిన అంచనాలను ఈ సంస్థ ఇప్పుడు తగ్గించింది. ఔన్సుకు $4,600 నుండి $4,400కు తగ్గించింది. ప్రపంచ మార్కెట్లో పసిడి ధర ప్రస్తుతం సుమారు 4,026 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే భవిష్యతులో ప్రస్తుత స్థాయి నుండి గరిష్టంగా 9 శాతం మాత్రమే పెరిగే అవకాశముంది

3 / 5
ప్రస్తుతం అమెరికన్ డాలర్ బలపడుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీల కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీని వల్ల బంగారం డిమాండ్‌ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. BMI అంచనా ప్రకారం డాలర్ ప్రస్తుతం 98 నుండి 102 పరిధిలో ఉండే అవకాశముంది. భవిష్యత్తులో ఈ సంఖ్య 105 నుండి 110కి పెరిగితే బంగారం ధరల పెరుగుదల పూర్తిగా నిలిచిపోతుంది. ఇక ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం బంగారానికి ప్రతికూలంగా పనిచేస్తోంది.

4 / 5
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని, రాబోయే రోజుల్లో పెంచే అవకాశాలున్నట్లు  నిపుణులు చెబుతున్నారు. రేట్లు 3.75 శాతం వద్ద అధికంగానే ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో బాండ్ల వంటి సురక్షితమైన ఎంపికల నుండి పెట్టుబడిదారులు మంచి రాబడిని పొందుతుతారు. దీంతో బంగారం వైపు వారి మొగ్గు తగ్గుతుంది. బంగారంపై ఎలాంటి వడ్డీ లేదా డివిడెండ్లు వంటివి రావు. అన్ని ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ బంగారం పూర్తిగా పతనమయ్యే అవకాశం లేదంటున్నారు.

5 / 5
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను స్థిరంగా పెంచుకుంటూనే ఉన్నాయి. ఈ భారీ కొనుగోళ్లు తక్కువ స్థాయిలలో ధరలకు బలమైన మద్దతును అందిస్తూనే ఉంటాయి. బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే లేదా డాలర్ బలహీనపడితే బంగారం ధర మరోసారి ఔన్సుకు 4,500 డాలర్లు మంచి పెరగవచ్చు.

Follow Us