Gold Loan: గోల్డ్ లోన్ తిరిగి చెల్లించలేకపోతున్నారా..? ఈ సందర్భాల్లో నగలు వేలం వేసే ఛాన్స్.. మీరు ఏం చేయాలంటే..?

Updated on: Oct 19, 2026 | 8:50 AM

ఆర్ధిక అవసరాల కోసం గోల్డ్ లోన్ తీసుకునేవారు పెరిగిపోతున్నారు. ఎవరికైనా అకస్మాత్తుగా డబ్బులు అవసరమైతే గుర్తుకొచ్చేది ఈ రుణమే. తమ ఇంట్లోని నగలను తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటారు. మీ బంగారు ఆభరణాలను హామీగా పెట్టుకుని బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.

1 / 5
ఇటీవల గోల్డ్ లోన్ తీసుకోవడం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. బంగారం ధరలు గతంలో పోలిస్తే భారీగా పెరగడంతో.. ఎక్కువ రుణం వస్తుందనే ఉద్దేశంతో తమ ఆర్ధిక అవసరాలను తీర్చుకునేందుకు ఎక్కువమంది తీసుకుంటున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరమైనప్పుడు అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఈ రుణమే. వేగంగా, తక్కువ డాక్యుమెంటేషన్‌, తక్కువ వడ్డీ వల్ల ఈ లోన్ బాగా పాపులర్ అయింది.

2 / 5
గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. మీరు ఈఎంఐ రూపంలో లేదా ఒకేసారి వడ్డీతో సహా చెల్లించి మీ బంగారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఒక ఈఎంఐ లేదా అంతకంటే ఎక్కువ ఈఎంఐలు పెండింగ్‌లో ఉంటే బ్యాంక్ మీ నగలను వేలం వేస్తుందా? అనే డౌట్ అందరిలో ఉంది. ఈ నియమాల గురించి తెలుసుకుందాం.

3 / 5
ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీరు లోన్ సకాలంలో చెల్లించనంత మాత్రాన లేదా ఈఎంఐలు పెండింగ్‌లో ఉంటే బ్యాంకులు మీ బంగారు ఆభరణాలకు వెంటనే వేలం నిర్వహించలేవు. మీరు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే పరిస్థితి చేయి దాటవచ్చు. మీ ఈఎంఐ ఆలస్యమైతే ముందుగా ఆర్ధిక సంస్థలు ఫోన్, ఎస్‌ఎంఎస్, యాప్ ద్వారా రిమైండర్లు పంపిస్తాయి. లేట్ ఛార్జీలు, ఇతర పెనాల్టీలు విధిస్తాయి.

4 / 5
30 నుంచి 90 రోజుల గడువు దాటితే మీకు రాతపూర్వకంగా నోటీసులు అందిస్తారు. రుణం చెల్లించకపోతే తదపరి చర్య తీసుకుంటామని హెచ్చరిస్తాయి. ఇలాంటి సమయంలో మీరు బ్యాంక్‌ను సంప్రదించి సహాయం పొందాలి. ఒకేసారి చెల్లించలేని పక్షంలో ఇతర ఆప్షన్ల గురించి చర్చించాలి. ఇక 90 రోజుల గడువు దాటితే  మీ రుణం నిరర్దక ఆస్తి(NPA)గా మారుతుంది.

5 / 5
ఎన్‌పీఏగా మారితే ఆర్ధిక సంస్థలు రికవరీ చర్యలు చేపడతాయి. ఇలాంటి సమయంలో లోన్ సెటిల్‌మెంట్ చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తాయి. వివిధ ఆప్షన్లను మీకు అందిస్తాయి. అప్పటికే మీరు చెల్లించనిపక్షంలో బ్యాంక్ నిబంధనల ప్రకారం మీ బంగారం వేలం వేయవచ్చు. వేలం వేయడానికి ముందు మీకు సమాచారం అందిస్తుంది. ఏ రోజుల వేలం జరుగుతుందనే వివరాలు మీకు తెలియచేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us