Gold Jewellery: బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది? రూల్స్‌ ఏంటి?

Updated on: Sep 07, 2026 | 8:48 PM

Gold Jewellery: మీరు బ్యాంకులో ఎంత బంగారం తాకట్టు పెట్టారు..? దీని విలువ, అలాగే దొంగతనం ఎలా జరిగింది? ఇలా అన్ని విధాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిహారం లభిస్తుందని గుర్తించుకోండి. అలాగే బంగారం తాకట్టుకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలిస్తారు అధికారులు..

1 / 5
 Gold Jewellery: తరచుగా బంగారు రుణం తీసుకునేటప్పుడు, ఆభరణాలను బ్యాంకు లేదా రుణ సంస్థ వద్ద తాకట్టు పెట్టవలసి ఉంటుంది. రుణం తిరిగి చెల్లించేలోపు బ్యాంకు ఆధీనంలో ఉన్న ఆభరణాలు దొంగిలించినా లేదా పోగొట్టుకున్నా, ఆ నష్టానికి ఎవరు పరిహారం చెల్లించాలి? ఆ పరిహారం ఎలా అందుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే, ఈ సందర్భంలో బ్యాంకు బాధ్యత, పరిహారం మొత్తం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

2 / 5
 తాకట్టు పెట్టిన బంగారం దొంగిలిస్తే ఏం చేయాలి?: మీరు తాకట్టు పెట్టిన బంగారం దొంగతానానికి గురైందని మీకు తెలిస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. అలాగే, జరిగిన సంఘటనకు సంబంధించిన రాతపూర్వక ప్రకటనను, పోలీసు ఫిర్యాదు లేదా ఎఫ్‌ఐఆర్ కాపీని బ్యాంకును అడగండి. బ్యాంకుతో మీరు జరిపిన సంభాషణలన్నింటినీ, అన్ని పత్రాలను భద్రపరచుకోండి. సంభాషణ సమయంలో దొంగతనం జరిగిన పరిస్థితులు ఏమిటో, నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో బ్యాంకును రాతపూర్వకంగా అడగండి.

3 / 5
 పరిహారం పొందడానికి ఈ పత్రాలను ఉంచుకోండి: మీ బంగారాన్ని డిపాజిట్ చేసినప్పుడు మీరు పొందిన తాకట్టు రసీదు, బంగారు రుణ ఒప్పందం, ఆభరణాల విలువ మదింపు నివేదిక వంటి పత్రాలను భద్రపరచుకోండి. ఈ పత్రాలు బ్యాంకులో ఏ ఆభరణాలు డిపాజిట్ అయ్యాయో, వాటి బరువు, విలువను నిరూపించగలవు. అలాగే, బంగారం ఫోటో, కొనుగోలు బిల్లును కూడా భద్రపరచుకోండి.

4 / 5
 బ్యాంకు వడ్డీతో పాటు డబ్బు చెల్లించాల్సి వస్తుందా? : సాధారణంగా దొంగతనంపై పరిహారం, వడ్డీ మొత్తం కేసు పరిస్థితులు, బ్యాంకు బాధ్యత, ఒప్పందం, బీమా, వర్తించే చట్టం ఆధారంగా నిర్ణయిస్తారు. అందువల్ల ప్రతి సందర్భంలోనూ బంగారం పూర్తి విలువ లేదా వడ్డీ స్వయంచాలకంగా చెల్లిస్తారని కూడా గ్యారంటి ఉండదు. నియమ నిబంధనలను బట్టి, అలాగే మీ బంగారం దొంగతనానికి గురైన పరిస్థితులను బట్టి మీకు పరిహారం వస్తుందని గుర్తించుకోండి.

5 / 5
 అయితే మీరు బ్యాంకులో ఎంత బంగారం తాకట్టు పెట్టారు..? దీని విలువ, అలాగే దొంగతనం ఎలా జరిగింది? ఇలా అన్ని విధాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిహారం లభిస్తుందని గుర్తించుకోండి. అలాగే బంగారం తాకట్టుకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలిస్తారు అధికారులు.

Loading...
Unable to load recommendations.
Follow Us