Gold: ఈ ఒక్క పని చేస్తే.. మీ బంగారం పోయినా డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు..

Updated on: Apr 27, 2026 | 4:56 PM

ప్రస్తుతం బంగారం విలువ అనేది పెరిగిపోయింది. అత్యంత విలువైన ఆస్తిగా ఇది మారిపోయింది. భారతీయులు ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా ఆస్తిగా దీనిని పరిగణిస్తారు. దీంతో బంగారానికి బీమా తీసుకోవాల్సిన అవసరముంది. ఇటీవల గోల్డ్ షాపుల నిర్వాహకులే ఉచిత బీమాను అందిస్తున్నారు.

1 / 5
హెల్త్, వెహికల్, లైఫ్, టర్మ్ ఇన్యూరెన్స్ వంటి వాటి గురించి మనం తరచూ వింటూ ఉంటాం. అయితే బంగారు ఆభరణాలకు కూడా ఇన్యూరెన్స్ ఉందని మీకు తెలుసా..? అవును.. మీరు ఇంట్లో దాచుకునే లేదా మీరు ధరించే బంగారు ఆభరణాలపై కూడా ఇన్యూరెన్స్ పొందే సౌకర్యం అందుబాటులో ఉంది. చాలామందికి ఈ విషయం గురించి తెలియదు. కానీ ఇటీవల గోల్డ్ ఇన్యూరెన్స్‌లు కూడా మార్కెట్లో తెగ పాపులర్ అవుతున్నాయి. అసలు ఏంటీ గోల్డ్ లోన్? అనేది ఇప్పుడు చూద్దాం.

2 / 5
ప్రస్తుతం తులం బంగారం రూ.1.5 లక్షలకు చేరుకుంది. దీంతో అత్యంత విలువైన ఆస్తిగా గోల్డ్ మారిపోయింది. దీంతో ఇళ్లు, షాపుల్లో ఉండే బంగారానికి ప్రమాదం పొంచి ఉంటుంది. దొంగతనం, దోపిడీ, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి జరిగితే మీరు ఆర్ధికంగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో వీటి నుంచి గోల్డ్ ఇన్యూరెన్స్ అనేది మీకు రక్షణ కల్పిస్తుంది. చాలామందికి బంగారానికి బీమా తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల దొంగతనం, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపోవాల్సి ఉంటుంది.

3 / 5
బంగారం ధరలు పెరుగుతుండటంతో ఇళ్లు, షాపుల్లో దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో గోల్డ్‌ను ఇంట్లో భద్రపర్చుకోవడం అనేది ప్రమాదకరంగా మారింది. ఇక షాపుల యజమానులకు కూడా భద్రపర్చుకోవడం కష్టంగా మారింది. ఇక కస్టమర్లకు చూపించేటప్పుడు, రవాణా సమయంలో దొంగతనం లేదా ఇతర నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో షాపుల నిర్వహకులు గోల్డ్ ఇన్యూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఏదైనా జరిగినప్పుడు భారీగా నష్ట పోవాల్సి ఉంటుంది.

4 / 5
దొంగతనం, దోపిడీ, అక్రమ దోపిడీ, అగ్ని ప్రమాదం,  ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటి నుంచి జరిగే నష్టాలను గోల్డ్ ఇన్యూరెన్స్ కవర్ చేస్తుంది. షాపుల నిర్వాహకులకు అయితే ఉద్యోగి మోసాన్ని కూడా ఇవి కవర్ చేస్తాయి. ఇక ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి సరుకు రవాణా చేసే సమయంలో జరిగే ఊహించని సంఘటనల నుంచి కూడా బీమా రక్షణ కల్పిస్తుంది.

5 / 5
దొంగతనాలు, ప్రమాదవశాత్తూ జరిగే నష్టాల నుంచి గోల్డ్ బీమా అనేది రక్షణగా నిలుస్తుంది. దీని ద్వారా మీకు ఆర్దికంగా నష్టం జరగదు. కార్లకు ఎలా అయితే బీమా చేయిస్తామో.. అలాగే విలువైన ఆస్తి అయిన బంగారానికి కూడా బీమా చేయించాల్సిన అవసరముందని చెప్పవచ్చు. కానీ చాలామందికి దీని గురించి అవగాహన లేక బీమా చేయించడం లేదు. కానీ కొన్ని కంపెనీలు బంగారం కొంటే ఉచితంగా బీమా చేయిస్తున్నాయి.

Follow Us