మీ బంగారం అసలైనదేనా? హాల్‌మార్క్ కాదు.. ఇలా చెక్ చేసుకోవాల్సిందే..

Updated on: Nov 22, 2026 | 7:57 AM

బంగారంకు సంబంధించి హల్‌మార్కింగ్‌ అమలు చేయడంలోని లోపాలను కాగ్ లేవనెత్తింది. దేశవ్యాప్తంగా 81 శాతం ఆభరణాలను దుకాణాలకు వెళ్లి అధికారులు తనిఖీ చేయలేదని గుర్తించింది. దీంతో వినియోగదారులు బంగారం కొనుగోలుచేసేందుకు దాని స్వచ్చత గురించి పరిశీలించాలి. అవసరమైతే హాల్ మార్కింగ్ కేంద్రానికి వెళ్లి స్వచ్చతను తనిఖీ చేయించుకోవచ్చు.

1 / 5
బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో ప్రతీ ఒక్క ఆభరణాల వ్యాపారి తప్పనిసరిగా తమ వద్ద ఉన్న బంగారానికి హాల్ మార్కింగ్ చేయించుకోవాలి. ఈ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కస్టమర్లకు విక్రయించాలి. అయితే తాజాగా కాగ్ కీలక విషయం వెలుగులోకి తెచ్చింది. తన ముసాయిదా ఆడిట్ నివేదికలో హాల్ మార్కింగ్ తనిఖీల్లోని లోపాలను ఎత్తిచూపింది.

2 / 5
హాల్ మార్కింగ్ వ్యవస్థపై కాగ్ ఆందోళనలు వ్యక్తం చేసింది. గత 5 ఏళ్లల్లో 81 శాతం కంటే ఎక్కువ నమోదిత ఆభరణాల షాపులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చెకింగ్‌లు చేయలేదని తెలిపింది. బంగారం హాల్‌ మార్కింగ్ నిబంధనల్లోని లోపాలను ఇది తెలియచేస్తోంది. దీంతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
బంగారం డిజైన్, ధరలు. మేకింగ్ ఛార్జీల గురించి మాత్రమే వినియోగదారులు పట్టించుకుంటారు. అయితే మీరు కొనుగోలు చేసే బంగారం అసలైనదా లేదా నకిలీదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. హాల్ మార్కింగ్ నిబంధనలను పాటిస్తున్నారా.. లేదా అనేది నిర్ధారించుకునేందుకు లైసెన్స్ పొందిన వ్యాపారుల వద్దకు వెళ్లి హాట్ మార్కింగ్ కేంద్రాలు ఏడాదికి ఒక్కసారైనా తనిఖీ చేయాలి. కానీ గత ఐదేళ్లలో 81 శాతం కంటే ఎక్కువ ఆభరణాలు తనిఖీలు చేయలేదని కాగ్ గుర్తించింది.

4 / 5
ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు పేరున్న నగల వ్యాపారి నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. బీఎస్ కేర్ యాప్ ద్వారా హాల్ మార్క్ వివరాలను చెక్ చేసుకోవాలి. అయితే ఇటీవల నకిలీ హెచ్‌యూఐడీ కోడ్‌లను సృష్టించే అవకాశముంది. దీంతో ఇటువంటి మోసాలను గుర్తించేందుకు మెరుగైన సాంకేతికత అవసరమని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
వినియోగదారులకు తమ బంగారం స్వచ్చతపై అనుమానాలంటే సమీపంలోని హాల్ మార్కింగ్, అసెయింగ్ కేంద్రాలకు వెళ్లి తనిఖీ చేయించుకోవచ్చు. బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రంలో చెక్ చేయించుకోవాలి. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే అధికారులను సంప్రదించవచ్చు

Loading...
Unable to load recommendations.
Follow Us