
బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే బ్యాడ్ న్యూస్. గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆమాంతం హైక్ అవుతూ వస్తోన్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం కాదని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దాని ప్రభావంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2290 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,34,300 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.2100 పెరుగుదల నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.2290 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా ట్రేడవుతుండగా.. నేడు రూ.2100 పెరిగింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,450గా ఉంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతుండగా.. నిన్న రూ.2.35 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.5 వేలు పెరిగింది.

హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.5 వేలు పెరిగింది. చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.40 లక్షలుగా ఉంది.