డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, సిమ్ స్విచ్ ఫ్రాడ్ లాంటి వాటి ద్వారా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. 2022 మొదటి త్రైమాసికంలో ఇలాంటి 24,270 మోసాలు జరిగాయి. రెండో త్రైమాసికంలో ఈ మోసాలు 26,793 కి పెరిగాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంప్లైంట్స్ తగ్గడం విశేషం. 2022 మొదటి త్రైమాసికంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి 20,443 కంప్లైంట్స్ నమోదైతే, రెండో త్రైమాసికంలో 19,267 ఫిర్యాదులు నమోదయ్యాయి.