Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఈ సేల్ జూలై 25 నుంచి జూలై 29 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది.
ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యుల కొరకు ఈ సేల్ 1 రోజు ముందుగా ప్రారంభం అవుతుంది. ఈ సేల్ లో ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
ప్రస్తుతం రూ.23,999 ధర గల పోకో ఎక్స్3 ప్లస్ సేల్ సమయంలో రూ.17,249 కే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో లభ్యం అవుతుంది. పోకో ఎక్స్3 ప్లస్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
ప్రస్తుతం రూ.23,999 ధరకు లభిస్తున్న షియోమీకి చెందిన ఎంఐ 11 లైట్ రూ.20,499 కే బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇవే కాకుండా పలు రకాల మొబైల్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.