Insurance Claim: ప్రమాద బీమా క్లెయిమ్‌ విషయంలో ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఎందుకు అవసరం

Updated on: Jan 30, 2024 | 11:24 AM

ఏదైనా ప్రమాదవశాత్తు నష్టం జరిగితే వెంటనే బీమా సంస్థకు తెలియజేయడం చాలా ముఖ్యమని డిజిటల్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌హెల్త్‌ క్లెయిమ్‌ సీనియర్‌ మేనేజర్‌ రాజా తన్వర్‌ అంటున్నారు. మీరు కంపెనీ ఈమెయిల్‌ లేదా హెల్ప్‌లైన్‌ నంబర్‌లో సమాచారాన్ని అందించవచ్చు. పాలసీ వివరాలను అందించడం అవసరం. సమాచారం అందించడానికి ఎఫ్‌ఐఆర్‌ అవసరంలేదంటున్నారు. బీమా క్లెయిమ్‌ చేయాలంటే..

ఎఫ్‌ఐఆర్‌.. ఇది పోలీసు కేసు నమోదైన సమయంలో ఈ పదాన్ని వాడుతుంటారు. అయితే చాలా మంది రకరకాల బీమా పాలసీలను తీసుకుంటారు. అయితే ఇన్సూరెన్స్‌ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదవశాత్తు మరణం సంభవించినా క్లెయిమ్‌ విషయంలో ఎఫ్‌ఐఆర్‌ కాపీ తప్పనిసరి. యాక్సిడెంట్‌ జరిగినప్పుడు ముందుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. బీమా సంస్థ నుంచి క్లెయిమ్‌ పొందాలంటే ముందుగా ప్రమాదం గురించి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావాలి.

అయితే ఏదైనా ప్రమాదవశాత్తు నష్టం జరిగితే వెంటనే బీమా సంస్థకు తెలియజేయడం చాలా ముఖ్యమని డిజిటల్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌హెల్త్‌ క్లెయిమ్‌ సీనియర్‌ మేనేజర్‌ రాజా తన్వర్‌ అంటున్నారు. మీరు కంపెనీ ఈమెయిల్‌ లేదా హెల్ప్‌లైన్‌ నంబర్‌లో సమాచారాన్ని అందించవచ్చు. పాలసీ వివరాలను అందించడం అవసరం. సమాచారం అందించడానికి ఎఫ్‌ఐఆర్‌ అవసరంలేదంటున్నారు. బీమా క్లెయిమ్‌ చేయాలంటే వివిధ పత్రాలతో పాటు ప్రమాదం వివరాలు, నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుందంటున్నారు.
అప్పుడు పాలసీ క్లెయిమ్‌ చేసుకునేందుకు సులభం అవుతుంది. మరీ ఎలాంటి సమయంలో ఎఫ్‌ఐఆర్‌ చేయాలి..? ఎఫ్‌ఐఆర్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ఎలాంటి పాత్రపోషిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Jan 30, 2024 11:23 AM