
వాహనదారులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ రూల్స్ మారనున్నాయి. మీరు ఫాస్టాగ్ వార్షిక పాస్ వాడుతుంటే.. షాక్ తగిలినట్లే. వాటి ధరలు బుధవారం నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వార్షిక ఫీజు రూ.3 వేలుగా ఉండగా.. రేపటి నుంచి రూ.3075కి పెంచనున్నారు. దీంతో స్వల్పంగా ధర పెరగనుంది.

పెంపు తక్కువగా ఉన్నప్పటికీ వాహనదారులపై అదనపు భారం పడనుంది. తరచూ రహదారులపై ప్రయాణించేవారు కొత్త ఆర్ధిక సంవత్సరానికి తమ పాస్‌ను రెన్యూవల్ చేసుకునే ముందు దీని గురించి తెలుసుకోండి. ప్రయాణికులు క్యూలో గంటలకొద్ది వేచి ఉండకుండా టోల్ గేట్ దాటడానికి ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది ఉపయోగపడుతుంది. మీ కార్డ్ త్వరలో రెన్యూవల్ చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.

టోల్ గేట్ల వద్ద లోట్ ఫీజు సులభతరంగా చెల్లించడానికి ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది ఉపయోగపడుతుంది. డబ్బు కోసం వెతక్కుండా, క్యూలో వేచి ఉండకుండా వెళ్లేందుకు వార్షిక పాస్ అనేది యూజ్ అవుతుంది. ప్రతీసారి టోల్ చెల్లించే బదులు ఏడాదికి ఒకేసారి చెల్లిస్తే అనేక ప్రయాణాలకు కవరేజ్ లభిస్తుంది. సమయం, డబ్బును ఇది ఆదా చేస్తుంది.

వార్షిక పాస్‌తో మీకు 200 వరకు టోల్ క్రాసింగ్‌లు లభిస్తాయి. అంతేకాకుండా యాక్టివేట్ చేసుకున్న రోజు నుంచి ఏడాది కాలం ఇది చెల్లుబాటు అవుతుంది. 200 ప్రయాణాలు ముగిసినా లేదా ఏడాది పూర్తయినా పాస్ పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత పునురుద్దరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ప్రైవేట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రతీరోజు హైవేపై ప్రయాణించేవారికి ఈ పాస్ బాగా ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 1వ తేదీలోపు మీరు పాస్‌ను పునురుద్దరించుకుంటే మరో ఏడాది పాటు తక్కువ ధరకే పొందుతారు. దీంతో ముందు చేసుకోవడం మంచిది. హైవేలపై తరచూ ప్రయాణించేవారికి ఇది సులభమైన ఆప్షన్‌గా చెప్పవచ్చు.