EPFO: పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. మరింత ఈజీగా..

Updated on: Apr 30, 2026 | 5:14 PM

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్‌వో త్వరలో కొత్త పోర్టల్ తీసుకురానుంది. ఈ పోర్టల్ ద్వారా సేవల్లో మరింత వేగంగా పెరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

1 / 5
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూ్స్. త్వరలోనే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త పోర్టల్ తీసుకురానుంది. ఇనాక్టివ్ అయిన పీఎఫ్ ఖాతాలను తిరిగి పునరుద్దరించుకునేందుకు, పాత అకౌంట్లను గుర్తించేందుకు ఈ ఫ్లాట్‌ఫామ్ సహాయపడనుంది. ఇ-ప్రాప్తి పేరుతో ఈ కొత్త వెబ్‌సైట్ తీసుకురానున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు.

2 / 5
పీఎఫ్ అకౌంట్‌లో వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్స్ చేయకపోయినా సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ చేస్తుంది.  దీనిని మళ్లీ యాక్టివ్ చేసుకోవాలంటే ఈపీఎఫ్‌వో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక కొంతమంది యూఏఎన్ నెంబర్లను మర్చిపోతుంటారు. దీంతో పాత అకౌంట్లను కూడా సులువుగా గుర్తించేందుకు ఈ కొత్త పోర్టల్‌లో ఫీచర్లను ప్రవేశపెట్టనున్నారు. దీంతో చందాదారులకు మరింత వేగంగా సేవలు అందనున్నాయి.

3 / 5
ఇ-ప్రాప్తి పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ లేని ఖాతాలను ఆధార్ ఐడెంటికేషన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు. దీని వల్ల ఈపీఎఫ్‌వో అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఈ వెబ్‌సైట్లోకి వెళ్లి సులువుగా ఏ పనులైనా చేసుకోవచ్చు. దీని వల్ల సేవల్లో వేగం పెరగడంతో పాటు కాగితపు పని తగ్గుతుందని మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. సేవలను మరింత మెరుగుపర్చేందుకు ఈ కొత్త పోర్టల్ తీసుకొస్తున్నట్లు తెలిపారు.

4 / 5
అటు గత ఆర్దిక సంవత్సరం 2025-26లో పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్లలో రికార్డ్ సృష్టించినట్లు తెలిపారు. ఏకంగా 8.31 కోట్ల క్లెయిమ్స్ జరగ్గా.. 71.11 శాతం అడ్వాన్సులను మూడు రోజుల్లోగా సెటిల్మెంట్ చేశామన్నారు. ఆటో మోడ్ విధానంలో వీటిని సెటిల్ చేసినట్లు తెలిపారు. 1.59 కోట్ల మంది ఖాతాదారులు యాజమాని ఆమోదం లేకుండా బ్యాంక్ అకౌంట్ సీడింగ్ పూర్తి చేసి క్లెయిమ్స్ పొందగా.. 6.68 కోట్ల మంది చెక్ లీఫ్ ఇమేజ్ అప్‌లోడ్ చేయకుండా క్లెయిమ్స్ పొందినట్లు పేర్కొన్నారు.

5 / 5
71 శాతం ముందస్తు క్లెయిమ్స్ కేవలం మూడు రోజుల్లోనే  ప్రాసెస్ చేశారు. ఇక  29.34  లక్షల మంది ప్రొఫైల్ అప్డేట్ చేసుుకోగా.. ఈ ఏప్రిల్ నెలలోనే 61 లక్షలకుపైగా క్లెయిమ్స్ పరిష్కరించారు. ఇక 99 శాతం మంది క్లెయిమ్స్ 20 రోజుల్లోనే పరిష్కరించారు. ఇ-ప్రాప్తి పోర్టల్ సాయంతో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Follow Us