
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ పాస్‌బుక్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. మొన్నటివరకు సిస్టమ్ అప్డేషన్ కారణంగా పీఎఫ్ పాస్‌బుక్ సేవలు నిలిచిపోయాయి. జూన్ 26వ తేదీ నుంచి పాస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. జులై 3వ తేదీ నుంచి పీఎఫ్ వెబ్ సైట్ ప్రారంభమవ్వగా.. పాస్ బుక్ సేవలు అందుబాటులోకి రాలేదు. నేటి నుంచి పాస్ బుక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఖాతాదారులు ఇప్పటినుంచి తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ వడ్డీని జమ చేసింది. వడ్డీని ఖాతాదారులు పాస్ బుక్‌లో చూడవచ్చు. ఈపీఎఫ్ఓ దాదాపు రెండు వారాల నిర్వహణ తర్వాత తన పాస్‌బుక్ పోర్టల్‌ను పునరుద్ధరించడంతో అందరూ వడ్డీని చెక్ చేసుకుంటున్నారు. దీనివల్ల లక్షలాది మంది చందాదారులు తమ పీఎఫ్ ఖాతా స్టేట్‌మెంట్‌లను ఆన్‌లైన్‌లో మరోసారి పొందుతున్నారు.

పాస్‌బుక్ సేవను పునరుద్ధరించడంతో పాటు యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియలో కూడా ఈపీఎఫ్ఓ ఒక ముఖ్యమైన మార్పు చేసింది. ఉద్యోగులు ఇకపై ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ద్వారా తమ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియ ఇప్పుడు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా ఉమాంగ్ యాప్‌కు మార్చబడింది.

సిస్టమ్ నిర్వహణ, సాంకేతిక నవీకరణల కారణంగా దాదాపు రెండు వారాల పాటు అందుబాటులో లేకుండా పోయిన EPFO పాస్‌బుక్ పోర్టల్ ఇప్పుడు తిరిగి అందుబాటులోకి వచ్చింది. చందాదారులు లాగిన్ చేసి వారి PF పాస్‌బుక్, ఖాతా స్టేట్‌మెంట్, కాంట్రిబ్యూషన్ వివరాలను చూసుకోవచ్చు. EPFO జూలై 15 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వార్షిక వడ్డీని జమ చేసింది.

పోర్టల్ తిరిగి పనిచేయడంతో సభ్యులు తమ ఖాతాలకు వడ్డీ మొత్తం జమ అయిందో లేదో పర్యవేక్షించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో మార్పులు చేసింది. దీంతో యూజర్లు మరింత వేగంగా పీఎఫ్ సేవలు పొందవచ్చు. దీంతో పాటు అనేక కొత్త మార్పులు వచ్చాయి.