Gold Rules: విదేశాల నుంచి ఎంతవరకు బంగారాన్ని ఇండియాకు తెచ్చుకోవచ్చు..? ఈ పరిమితి వరకు ఫ్రీ.. కొత్త రూల్స్..

Updated on: Nov 06, 2026 | 7:40 AM

కొన్ని దేశాల్లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అక్కడ కొనుగోలు చేసి భారత్‌కు చాలామంది తెచ్చుకుంటుంటారు. ఇలాంటి సమయంలో కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక పరిమితి వరకు బంగారంపై ఎలాంటి కస్టమ్స్ సుంకాలు ఉండవు. ఒక లిమిట్ వరకు ఉచితంగా తెచ్చుకోవచ్చు.

1 / 5
భారతీయులు బంగారాన్ని ఎంత ఇష్టపడతారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌తో పోలిస్తే కొన్ని దేశాల్లో బంగారం తక్కువ ధరకు లభిస్తోంది. దీంతో విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ నుంచి గోల్డ్ కొని ఇక్కడికి తెచ్చుకుంటుంటారు. ముఖ్యంగా దుబాయ్‌లో బంగారంపై ఎలాంటి ట్యాక్సులు ఉండవు. దీంతో చవక ధరకే గోల్డ్ లభిస్తుండగా.. అక్కడికి వెళ్లినవారు బంగారం కొని ఇండియాకు తెచ్చుకుంటారు. అయితే ఇలా తెచ్చుకునేవారు కస్టమ్స్ నిబంధనల గురించి తెలుసుకోవాలి. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి.

2 / 5
కస్టమ్స్ రూల్స్ ప్రకారం ఒక పరిమితి వరకు ఎలాంటి సుంకాలు కట్టకుండా దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకోవచ్చు. కనీసం ఆరు నెలల పాటు విదేశాల్లో నివసించిన ప్రయాణికుడు విదేశీ కరెన్సీలో రాయితీ సుంకం చెల్లించి ఆభరణాలు, కాయిన్స్, కడ్డీల రూపంతో 1 కిలోగ్రాము బంగారం తెచ్చుకోవచ్చు. అయితే పురుష, మహిళా ప్రయాణికులకు ఈ నిబంధనలు వేర్వురుగా ఉంటాయి. రాళ్లు, ముత్యాలు లాంటి వాటికి ఈ సుంకం మినహాయింపు వర్తించదు. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.

3 / 5
మహిళా ప్రయాణికురాలు విదేశాల్లో ఒక ఏడాది కంటే ఎక్కువ రోజులు ఉండి ఉంటే.. 40 గ్రాముల బంగారాన్ని ఎలాంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా తెచ్చుకోవచ్చు. ఇక పురుష ప్రయాణికులు 20 గ్రామలు వరకు ఒక్క రూపాయి కూడా కస్టమ్స్ సుంకం చెల్లించకుండా ఇక్కడికి తెచ్చుకోవచ్చు.  ఒక ఏడాది కంటే తక్కువ కాలం ఉంటే సుంకం చెల్లించకుండా తీసుకురావడానికి అనమతి ఉండదు. ప్రస్తుతం బంగారంపై సుంకం 15 శాతం ఉంది.

4 / 5
ఒక ఏడాదికిపైగా విదేశాల్లో ఉన్న పురుష ప్రయాణికుడు రూ.50 వేల వరకు విలువ చేసే బంగారు ఆభరణాలను సుంకం చెల్లించకుండా భారత్‌కు తెచ్చుకునేందుకు అనుమతి ఉంది. అదే మహిళ అయితే రూ.లక్ష వరకు విలువ చేసే ఆభరణాలను ఒక్క రూపాయి కూడా సుంకం చెల్లించకుండా తీసుకొచ్చేందుకు అనుమతి ఉంది. బంగారంతో పాటు పాస్ పోర్ట్, బిల్లులు, క్వాలిటీ ధృవీకరణ పత్రాలను కస్టమ్స్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది

5 / 5
ఒక వ్యక్తి భారత్ నుంచి విదేశాలకు బంగారు ఆభరణాలు తీసుకెళ్తుంటే.. కస్టమ్స్ అధికారుల నుంచి ఎగుమతి ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి చిక్కులు ఉండవు. ATITHI యాప్‌లో తమ బంగారం వివరాలను ప్రకటించాలి. వీళ్లు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్లడానికి రెడ్ ఛానెల్ ఉపయోగించాలని చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us