Dmart Tricks: డీమార్ట్‌లో క్యారీ బ్యాగ్‌కు మీరు చెల్లించిన సొమ్ము మొత్తం తిరిగి పొందోచ్చు.. 99 శాతం మందికి ఈ ట్రిక్ తెలియదు..

Updated on: Oct 16, 2026 | 10:05 AM

డీమార్ట్‌కు వెళ్లేవారికి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. క్యారీ బ్యాగ్ కోసం మీరు చెల్లించిన సొమ్ము తిరిగి పొందే అవకాశముంది. దీని కోసం మీరు ఒక చిన్న పని చేస్తే సరిపోతుంది. క్యారీ బ్యాగ్ కోసం చెల్లించిన సొమ్ము తిరిగి ఎలా రీఫండ్ పొందాలనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఇంట్లోకి ఏదైనా వస్తువు అవసరమైతే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు డీమార్ట్. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బెస్ట్ షాపింగ్ డెస్టినేషన్‌గా చెప్పవచ్చు. తక్కువ ధరలు, భారీ డిస్కౌంట్ల వల్ల నెలవారీ  ఇంటి ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో ఎక్కువమంది ఈ సూపర్ మార్కెట్‌కు వెళ్తుంటారు. అయితే డీమార్ట్‌కి వెళ్లినప్పుడు కొంతమంది క్యారీ బ్యాగ్‌ను తీసుకెళితే.. మరికొంతమంది తమ వెంట తీసుకెళ్లరు. ఇలాంటప్పుడు క్యారీ బ్యాగ్ కొనుగోలు చేస్తుంటారు.

2 / 5
అనేక రకాల క్యారీ బ్యాగ్‌లు డీమార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. రకాన్ని బట్టి రూ.10 నుంచి రూ.25 వరకు తీసుకుంటారు. బిల్లులోనే క్యారీ బ్యాగ్ ధరను కలుపుతారు.  ఇక్కడికి వెళ్లినప్పుడల్లా ప్రతీసారి రూ.25 చెల్లించాలంటే వృథా ఖర్చు చేసినట్లు అవుతుంది.  ఈ డబ్బులు ఆదా చేసుకునేందుకు చాలామంది తమ ఇంటి నుంచే ఒక క్యారీ బ్యాగ్‌ను తీసుకెళ్తుంటారు.

3 / 5
అయితే డీమార్ట్‌లో మీరు క్యారీ బ్యాగ్ కొనుగోలు చేసినా సరే.. మీరు చెల్లించిన సొమ్ము తిరిగి రీఫండ్ పొందవచ్చు. ఈ ట్రిక్ చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. మీరు కొనుగోలు చేసిన బ్యాగ్‌ను తిరిగి డీమార్ట్ వారికి అందిస్తే.. మీరు బ్యాగ్ కోసం  చెల్లించిన మొత్తం డబ్బులు రీఫండ్ అందిస్తారు. వారం రోజుల్లో మీరు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

4 / 5
ౌవారం రోజుల్లోగా మీరు ఏ డీమార్ట్‌లో బ్యాగ్ కొనుగోలు చేశారో అక్కడికి బిల్లు, బ్యాగ్ తీసుకుని వెళ్లండి. ప్రతీ డీమార్ట్ బయట కస్టమర్ కేర్ సెంటర్ ఉంటుంది. అక్కడి సిబ్బందికి మీ బిల్లు, బ్యాగ్ అందించండి. దీంతో సిబ్బంది చెక్ చేసి బ్యాగ్ కోసం మీరు  ఎంత అయితే చెల్లించారో.. అంత మొత్తాన్ని తిరిగి అందిస్తారు. దీంతో బ్యాగ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టామనే బాధ మీకు ఉండదు.

5 / 5
అయితే వారం రోజుల్లోగా అందిస్తేనే ఈ రీఫండ్ అందిస్తారని తెలుస్తోంది. సాధారణంగా నిబంధనల ప్రకారం క్యారీ బ్యాగ్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి వినియోగదారలు ఫోరంలో చాలా కేసులు ఉండగా.. పలు తీర్పులు వచ్చాయి. క్యారీ బ్యాగ్ కోసం అదనంగా వసూలు చేసినందుకు డీమార్ట్‌కు భారీగా జరిమానాలు విధించిన సందర్బాలు ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us