
నాన్వెజ్ ప్రియులకు పండుగ వేళ దెబ్బ తగిలింది. ధరలు భారీగా పెరుగుతున్నాయి. పండుగ సమయాల్లో చికెన్కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గత కొద్ది రోజులుగా ధరలు కొండెక్కుతుండగా.. పండక్కి ముందు మరింత పుంజుకున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో పండుగ సీజన్ కారణంగా మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.261 వద్ద కొనసాగుతోండగా.. డ్రస్స్డ్ చికెన్ రూ.231గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.149, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.122గా ఉంది.

కరీంనగర్ జోన్లో కిలో స్కిన్ లెస్ రూ.261గా ఉండగా.. డ్రస్స్డ్ చికెన్ రూ.231, రిటైల్ లైవ్ బర్డ్ రూ.149, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.122 వద్ద కొనసాగుతోంది.

విజయవాడ జోన్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.275గా ఉండగా.. డ్రస్స్డ్ చికెన్ రేటు రూ.243గా కొనసాగుతోంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.157గా ఉండగా.. ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.130గా ఉంది.

ఇక కోడి గుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ జోన్లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.80 పలుకుతున్నాయి. అలాగే హైదరాబాద్ జోన్లో 12 గుడ్ల ధర రూ.76గా ఉంది. ఇక కరీంనగర్ జోన్లో రూ.76 పలుకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.300కి విక్రయిస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.