Bank Holidays: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నేడు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయా..?

Updated on: Mar 31, 2026 | 11:12 AM

మహావీర్ జయంతి సందర్బంగా మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. సెలవులు అనేవి రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. రాష్ట్రాలు, ప్రాంతీయ పండుగులను బట్టి ఆర్బీఐ సెలవులు ఇస్తూ ఉంటుంది. మహావీర్ జయంతిని పలు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. దీంతో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.

1 / 5
మహావీర్ జయంతిని పురస్కరించుకుని మార్చి 31వ తేదీన అహ్మదాబాద్, బేలాపూర్, చెన్నై, జైపూర్, కోల్ కత్తా, కాన్పూర్, లక్నో, ముంబై, రాంచీ, పాట్నా, రాయపర్, ఢిల్లీ, నాగపూర్ నగరాల్లో బ్యాంకులు మూసివేశారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు యథావిధిగా నేడు పనిచేస్తాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సేవలను ప్రజలు ఎప్పటిలాగే పొందవచ్చు.

2 / 5
నేడు దేశవ్యాప్తంగా మహావీర్ జయంతిని జరుపుకుంటున్నారు. జైనులు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జైన మతానికి చెందిన భగవాన్ మహావీరుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఇవాళ బ్యాంకులు ఎక్కడెక్కడ మూతపడతాయో చూద్దాం.

3 / 5
ఇక ఏప్రిల్ 1న అనేక సిటీలలో బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకులు తెరిచి ఉంటాయి గానీ కస్టమర్లకు సేవలు అందించరు. కొత్త ఆర్ధిక సంవత్సరం రావడంతో తమ అకౌంటింగ్ ప్రక్రియలను పూర్తి చేయడానికి, లావాదేవీలను సరిపోల్చుకోడానికి, ఇతర ఆర్దిక నివేదికలను సిద్దం చేయడానికి బ్యాంక్ సిబ్బంది పనిచేస్తారు. అందుకే ఏప్రిల్ 1న బ్యాంక్ బ్రాంచ్ సేవలను పొందటంలో కస్టమర్లు ఇబ్బందులు పడవచ్చు

4 / 5
ఇక ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు చాలానే ఉన్నాయి. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 11న రెండో శనివారం, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి. ఏప్రిల్ 25న రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు.  అయితే బ్యాంకులు మూసివేసినా ఆన్ లైన్, ఏటీఎం, యూపీఐ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. కేవలం చెక్కుల క్లియరెన్స్ సేవలు నిలిచిపోతాయి.

5 / 5
ఇక మేలో కూడా బ్యాంక్ సెలవులు వచ్చాయి. మే1న మేడే, మే 9న రెండో శనివారం, మే 23న నాలుగో శనివారం, మే27న బక్రీద్ సందర్భంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. దీంతో బ్యాంక్ సెలవులను ముందుగానే కస్టమర్లు తెలుసుకుని జాగ్రత్త పడాలి. ముందుగానే నగదును సిద్దం చేసి పెట్టుకోవాలి

Follow Us